ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా పుష్ప 2 సినిమా ప్రస్తావననే. అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమా రికార్డు స్థాయిలో విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. కేవలం ఐదు రోజుల్లో దాదాపు 600 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. ఇదే జోరు కొనసాగిస్తే మరికొన్ని రోజులలో 1000 కోట్ల మార్కును త్వరలోనే క్రాస్ చేయబోతుంది. ఈ పాన్ ఇండియా సినిమా విడుదల సమయంలో దేశవ్యాప్తంగా పలు నగరాలలో ప్రమోషన్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా పుష్ప ఈవెంట్స్ పై హీరో సిద్ధార్థ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ ఏమన్నారంటే సిద్ధార్థ్ హీరోగా నటించిన 'మిస్ యు' శుక్రవారం డిసెంబర్ 13న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా తమిళ మీడియా ముందుకు వచ్చారు. అప్పుడు జేసీబీ కామెంట్స్ గురించి ఒక విలేకరిగా ప్రశ్నించారు. అప్పుడు ఆయన సారీ చెప్పలేదు. అలాగని అల్లు అర్జున్ గురించి గొప్పగా కూడా మాట్లాడలేదు. మరి ఆయన ఏం చెప్పారో చూడండి.
''మీరు అడిగిన ప్రశ్నలోనే ఒక గొడవ ఉంది. ఆ గొడవ గురించి చెప్పాల్సిన అవసరం, మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. 'పుష్ప 2' పెద్ద విజయం సాధించిన సినిమా. ఆ చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు. వాళ్ళు ఫస్ట్ పార్ట్ తీసి పెద్ద హిట్ కొట్టారు. ఫస్ట్ పార్ట్ సక్సెస్ చేయడం వల్ల అంత మంది జనాలు వచ్చారు. అదొక పాజిటివ్ సైన్. మనం ఎంత మంది జనాలను తీసుకు వస్తే అంత మంది ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని, తీసుకు రాగలమని మనం నమ్మాలి. సినిమా హెల్దీగా ఉండాలి. ఎవరి మీద ఎవరికీ కోపం లేదు. అందరం ఒకటే పడవలో ప్రయాణం చేస్తున్నాం. ఇవాళ ఒక సినిమా విడుదలై హిట్ అవ్వడం అనేది వందలో ఒక్కటిగా జరుగుతోంది. నిర్మాతలకు మంచి జరగాలి. రెండు మూడు సంవత్సరాలు కష్టపడి సినిమాలు చేసే ఆర్టిస్టుల కష్టానికి తగ్గ ఫలితం రావాలి. మా ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే మంచి సినిమాలు చేయాలని'' అని చెప్పారు సిద్ధార్థ్.

మరింత సమాచారం తెలుసుకోండి: