తెలుగు సినిమా జర్నలిస్టులో మూర్తి ఒకరు. ఈయన చాలా సంవత్సరాలుగా తెలుగు సినిమా జర్నలిస్టుగా కొనసాగుతున్నాడు. ఇకపోతే ఈయన ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూ కూడా చేశాడు. ఆ ఇంటర్వ్యూల ద్వారా కూడా ఈయన చాలా మంది కి తెలిసారు. ఇకపోతే ఈయన దాదాపు ప్రతి సినిమా ఈవెంట్ కు హాజరవుతూ సినిమా బృందాలను అనేక ప్రశ్నలు అడుగుతూ అనేక సందర్భాలలో వైరల్ కూడా అయ్యారు. ఇకపోతే ఈయన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు.

ఈయనకు "X" ఖాతాలో దేవి ప్రియ అనే పేరుతో ఒక అకౌంట్ ఉంది. ఆ అకౌంట్ ద్వారా ఈయన ఎప్పటికప్పుడు అనేక సినిమాలకు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ ఉంటాడు. ఈయన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేసే వివరాలలో చాలా వరకు అప్డేట్లు నిజం అవుతూ ఉండడంతో రోజు రోజుకు ఈయన "X" ఖాతాలో ఫాలోవర్స్ కూడా పెరిగిపోతూ వస్తున్నారు. ఇకపోతే ఈయన మూర్తి పేరుతో పాటు దేవి ప్రియ అనే పేరుతో కూడా బాగా పాపులారిటీని సంపాదించుకున్నాడు.

తెలుగు సినీ పరిశ్రమలో సినిమా జర్నలిస్టుగా చాలా సంవత్సరాలుగా కెరియర్ను కొనసాగిస్తున్న ఈయనను తెలుగు ఫిలిం జ‌ర్న‌లిస్ట్ అసోసియేష‌న్ స‌స్పెండ్ చేసిన‌ట్లు తెలుస్తుంది. అసోసియేష‌న్ కార్య‌క్రామాల‌కు వ్య‌తిరేకంగా వ్య‌వ‌హారిస్తున్నందుకు ఈయనను 6 నెల‌ల పాటు సస్పెండ్ చేస్తున్న‌ట్లు (టీ ఎఫ్‌ జే ఏ) ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఇకపోతే ఈయనను తెలుగు ఫిలిం జ‌ర్న‌లిస్ట్ అసోసియేష‌న్ స‌స్పెండ్ చేసినప్పటికీ "X" ఖాతాలో మూర్తి మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తున్నాడు. ఇకపోతే మూర్తి ఈ మధ్య కాలంలో కూడా చాలా మంది సినిమా సెలబ్రిటీలతో ఇంటర్వ్యూ లను నిర్వహించాడు. వాటిలో చాలా ఇంటర్వ్యూలకు మంచి రెస్పాన్స్ జనాల నుండి వచ్చింది. అలాగే కొన్ని ఇంటర్వ్యూ లో సూపర్ గా వైరల్ కూడా అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: