తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన స్టార్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ సినిమాలలో హీరోగా నటించి 60 సంవత్సరాల వయసు దాటినా కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే చిరంజీవి తన కెరీర్లో ఎన్నో సినిమాలను వదులుకున్నాడు. ఆయన వదులుకున్న కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ కాగా , మరికొన్ని సినిమాలు అద్భుతమైన విజయాలను కూడా అందుకున్నాయి. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి కి ఒక స్టోరీ వినిపించగా ఆయన దానిని రిజెక్ట్ చేయడంతో ఆ కథ రజనీ కాంత్ వద్దకు వెళ్లిందట. ఇక రజిని ఆ సినిమాలో నటించగా ఆ మూవీ ఏకంగా బ్లాక్ బాస్టర్ విజయం అందుకున్నట్లు తెలుస్తోంది. మరి చిరంజీవి రిజాక్ట్ చేసిన స్టోరీ ఏది ..? అసలు ఎందుకు రిజక్ట్ చేశాడు. ఆ కథతో రూపొంది బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమా ఏది అనే వివరాలను తెలుసుకుందాం.

సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరో గా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ అనే మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ , చిరంజీవి తో చేయాలి అనుకున్నాడట. అందులో భాగంగా మూవీ కథను తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగి ఉన్న నిర్మాతలలో ఒకరు అయినటువంటి దిల్ రాజ్ కి నెల్సన్ దిలీప్ కుమార్ వినిపించాడట. ఇక దిల్ రాజు చిరంజీవి కి ఈ సినిమా కథను వివరించగా , ఆయనకు కథ బాగా నచ్చిన ఆ సినిమా తనపై వర్కౌట్ అవుతుందో ... లేదో తన ఫ్యాన్స్ ఈ సినిమాను ఎలా తీసుకుంటారో అనే ఉద్దేశంతో ఈ మూవీ ని రిజెక్ట్ చేశాడట. ఆ తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్మూవీ కథను రజినీ కాంత్ కు వినిపించగా ఆయన ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇక చివరగా జైలర్ మూవీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. అలా చిరు రిజెక్ట్ చేసిన స్టోరీ తో రజిని బ్లాక్ బస్టర్ అందుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: