ఇండియన్ క్రికెట్ టీమ్ లో అద్భుతమైన ఆటగాడిగా పేరు తెచ్చుకున్న వారిలో సచిన్ టెండూల్కర్ ఒకరు. ఈయన ఎన్నో సంవత్సరాలు తన అద్భుతమైన ఇన్నింగ్స్ తో భారత జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు. దానితో ఈయనకు ఇండియా వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇకపోతే సచిన్ తన అద్భుతమైన ఆట తీరుతో కేవలం ఇండియన్స్ ను మాత్రమే కాకుండా అనేక దేశాల అభిమానులను కూడా సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే పైన ఫోటోలో సచిన్ టెండూల్కర్ తో ఒక చిన్న బాబు ఉన్నాడు కదా ఆయన ఎవరో గుర్తుపట్టారా ..? ఆయన టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటుడి కుమారుడు.

ఇకపోతే ఇప్పటికే ఈ ఫోటో లో చిన్న కుర్రాడిగా ఉన్న అబ్బాయి సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలలో కూడా నటించాడు. మరి ఇప్పటికైనా ఆయన ఎవరో గుర్తుపట్టారా ..? పైన సచిన్ తో పాటు ఉన్న చిన్న పిల్లాడు మరెవరో కాదు. తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న శ్రీకాంత్ తనయుడు రోషన్. రోషన్ "నిర్మల కాన్వెంట్" అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఇకపోతే కొంత కాలం క్రితమే రోషన్ "పెళ్లి సందD" అనే సినిమా లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో శ్రీ లీల హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. 

ఈ సినిమాతో రోషన్ కి నటుడిగా మంచి గుర్తింపు లభించింది. పెళ్లి సందD సినిమా వచ్చి ఇప్పటికే చాలా కాలం అవుతున్న రోషన్ మాత్రం ఇప్పటి వరకు తన తదుపరి మూవీ ని స్టార్ట్ చేయలేదు. రోషన్ తన తదుపరి మూవీ ని వైజయంతి మూవీస్ బ్యానర్ లో చేయనున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటివరకు ఈ వార్తకు సంబంధించి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: