సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ పరంగా వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మహేష్ రాజమౌళి కాంబో మూవీపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా ఈ సినిమాలో ఎన్నో ఆసక్తికర ట్విస్టులు ఉండనున్నాయని తెలుస్తోంది. ఈ సినిమాతో మహేష్ ఖాతాలో మరో ఇండస్ట్రీ హిట్ చేరుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పోకిరి తర్వాత మహేష్ ఖాతాలో మరో ఇండస్ట్రీ హిట్ చేరనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మహేష్ బాబు రెమ్యునరేషన్ ప్రస్తుతం 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. రాజమౌళి మాత్రం ఈ సినిమా కోసం ఊహించని స్థాయి పారితోషికాన్ని సొంతం చేసుకోనున్నారు. అయితే మహేష్ బాబు ఫ్యాన్స్ ను ఆయన పీఆర్ టీం వైసీపీ వైపు మళ్లిస్తోందని సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతోంది.
 
వైరల్ అవుతున్న ఈ వార్త మహేష్ ఫ్యాన్స్ కు సైతం కోపం, చిరాకు తెప్పిస్తోంది. వాస్తవానికి మహేష్ బాబుకు అధికారికంగా ఎలాంటి పీఆర్ టీం లేదు. మహేష్ ఇమేజ్ కు భంగం కలిగించే విధంగా వస్తున్న వార్తలు అభిమానులను సైతం ఎంతో హర్ట్ చేస్తున్నాయి. మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం వైరల్ అవుతున్న వార్తల విషయంలో ఎంతగానో బాధ పడుతుండటం గమనార్హం.
 
సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ పరంగా అంతకంతకూ ఎదగాలని భారీ విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మహేష్ బాబు కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాలి. రాజమౌళి సినిమా పూర్తైన తర్వాత వేగంగా ఎక్కువ సంఖ్యలో సినిమాల్లో నటించేలా మహేష్ బాబు కెరీర్ ను ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని చెప్పవచ్చు. సూపర్ స్టార్  మహేష్ బాబు సాధారణంగా వివాదాలకు, రాజకీయాలకు దూరంగా ఉంటారని ఆయనను అనవసర వివాదాల్లోకి లాగొద్దని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: