మంచు ఫ్యామిలీ గొడవలు: తెలుగు చిత్ర పరిశ్రమలో గత కొన్ని రోజులుగా మంచు కుటుంబం తెలుగు రాష్ట్రాల్లోనే ఎంతో హాట్ టాపిక్ గా మారింది .. మంచు మోహన్ బాబు కుటుంబంలో గొడవలు ముదిరి రోడ్డున పడ్డాయి .. కొడుకు మనోజ్ మీద మోహన్ బాబు పోలీస్ ఫిర్యాదు చేస్తే తండ్రి వ్యక్తిగత సిబ్బంది మీద కొడుకు కేసు పెట్టారు . ఇలా కుటుంబం మొత్తం పోలీసుల చుట్టూ కోర్టులు చుట్టూ తిరుగుతుంది . తను ఆస్తికోసం పోరాటం చేయడం లేదని తన ఆత్మగౌరం కోసం పోరాడుతున్నానని మనోజ్ అంటున్నారు .. ప్రస్తుతం మీడియాలో సోషల్ మీడియాలో దీనిమీద పెద్ద డిస్కషన్ జరుగుతుంది .. ఇక దీంతో సహనం కోల్పోయిన మొహన్‌బాబు మీడియా ప్రతినిధి మీద దాడి చేయడంతో ఈ వివాదం ఊహించని మలుపు తిరిగింది . ఇక్కడ తప్పుడు ఎవరది అనేది పక్కన పెడితే ఇన్ని సంవత్సరాలు క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే ఈ ఫ్యామిలీలో విభేదాలు రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీన్ని మంచు బ్రదర్స్ ఎలా సొద్దు బాటు చేసుకుంటారో చూడాలి.
ధనుష్ నయనతార వివాదం: నయనతార బియాండ్ ది ఫేరిటెల్ డాక్యుమెంటరీ విషయంలో ధనుష్ , నయనతార మధ్య నేలకొన్న వివాదం తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారం రేపింది. తాను నటించిన 'నానుమ్ రౌడీ దాన్' సినిమా విజువల్స్ వాడి కోవటానికి నిర్మాత ధనుష్ అనుమతి ఇవ్వలేదు .. తన అనుమతి లేకుండా మూడు సెకండ్ల బీటీఎస్ ఫుటేజీ వాడినందుకు 10 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేస్తూ ధనుష్ లిగల్ నోటీసులు పంపిన విషయం తెలిసిందె. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న ధనుష్ డాక్యుమెంటరీలో అనుమతి లేకుండా తన సినిమాలోని విజువల్స్ ఉపయోగించారంటూ నయనతార ఆమె భర్త విగ్నేష్ శివన్ పై మద్రాస్ కోర్టులో పిటిషన్ వేశారు.
అక్కినేని నాగార్జున పరువు నష్టం దావ : అక్కినేని కుటుంబం ఈ ఏడాది కోర్టు మెట్లు ఎక్కింది. నాగచైతన్య , సమంత విడాకులకు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారణమంటూ తెలంగాణ మంత్రి కొండ సురేఖ చేసిన తీవ్రమైన ఆరోపణలు , అలాగే ఎన్ కన్వెన్షన్ కూల్చి వేయకుండా ఉండేందుకు సమంత ను కేటీఆర్ దగ్గరికి పంపించేందుకు హీరో నాగార్జున , నాగచైతన్య బలవంత పెట్టారని దీనికి సమంతా నిరాకరించడం కారణంగా విడాకులు ఇచ్చారని కొండా సురేఖ వ్యాఖ్యలు చేసింది . అక్కినేని ఫ్యామిలీని ఉద్దేశిస్తూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడంతో మంత్రిపై తీవ్ర విమర్శలు వచ్చాయి .. ఈ విషయంలో ఇండస్ట్రీ అంతా అక్కినేని కుటుంబానికి సమంతకు సపోర్టుగా నిలిచింది .. ఇక ఆ మంత్రి వ్యాఖ్యలపై సీరియస్ అయన నాగార్జున ఆమెపై నాంపల్లి కోర్టులో 100 కోట్ల పరువు నష్టం దావా వేశారు.
రాజ్ తరుణ్ లావణ్య వివాదం: తెలుగు చిత్ర పరిశ్రమను ఒక కుదుపు కుదిపేసిన వివాదంలో రాజు తరుణ్ , లావణ్య వివాదం కూడా ఒకటి .. టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ తనతో 11 సంవత్సరాలు సహజీవనం చేసి , నమ్మించి వదిలేసి వెళ్లిపోయారని లావణ్యనే అమ్మాయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. . పెళ్లి చేసుకుంటాని ప్రెగ్నెంట్ చేసి అబార్షన్ చేయించుకునేలా ఒత్తిడి తీసుకొచ్చాడని హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో డేటింగ్ చేస్తూ ఇప్పుడు తనని వదిలించుకోవాలని చూస్తున్నాడు అంటూ సంచలన ఆరోపణ చేసింది . ఈ విషయంపై ఇరు వర్గాలు కోర్టు మెట్లు కూడా ఎక్కాయి. అప్పట్లో అందరికీ ఇదే హట్ టాపిక్ గా మారింది .. తర్వాత కాంప్రమైజ్ చేసుకుని కేసు కొర్టు పరిధిలో ఉందని అనుకున్నారు ఏమో తెలియదు కానీ అందరూ సైలెంట్ అయిపోయారు .. ఇక రాజ్ తరుణ్ ఎప్పటిలాగే సినిమాతో బిజీ అయిపోగా లావణ్య మళ్ళీ మీడియా ముందుకు రాలేదు.
రేప్ కేసులో జైలుకు జానీ మాస్టర్: టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపులు ఆరోపణలతో కొన్ని రోజులు జైలు జీవితం గడిపిన విషయం తెలిసిందే.. మాస్టర్ తను లైంగికంగా వేధించాడంటూ ఆయన దగ్గర అసిస్టెంట్గా పని చేసిన ఓ అమ్మాయి కేసు పెట్టింది. అత్యాచారం చేసినప్పుడు తను మైనర్ అని ఆమె చెప్పటంతో పెద్ద వివాదానికి దారితీసింది .. ఈ క్రమంలో జానీ మాస్టర్ పై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసి జైల్లో వేశారు .. దాంతో ఆయనకు ప్రకటించిన నేషనల్ అవార్డు కూడా రద్దు చేశారు.. 36 రోజులపాటు చంచల్ కూడా జైల్లో ఉన్నజాని కొన్ని రోజుల క్రితం బైలుపై బయటకు వచ్చారు .. జానీ మాస్టర్ కు ఈ సంవత్సరం తన జీవితంలో మర్చిపోలేని చేదు సంవత్సరంగా మిగిలింది.
కన్నడ హీరో దర్శన్ మర్డర్ కేసు : కన్నడ స్టార్ హీరో దర్శన్ మర్డర్ కేసులో జైలుకు వెళ్లి వచ్చారు . నటి పవిత్ర గౌడతో కలిసి రేణుక స్వామి అనే అభిమానిని హత్య చేశారని ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు .. హీరోయిన్ పవిత్రకు అసభ్యకరమైన మెస్సేజ్‌లు పంపి వేధించారని కారణంతో అతని హింసించి చంపినట్లుగా పోలీసులు సాక్షాలు ఆధారాలు సేకరించారు .. దీనిపై ముందుగా 3వేల పేజిల చార్జ్ షిట్ దాఖలు చేసిన పోలీసులు దానికి అనుబంధంగా మరో 1300 పేజీల చార్జ్ షిట్ వేశారు. అయితే దర్శన్ వెన్నుముకకు సర్జరీ చేయించుకోవాలని పిటీషన్ వేయడంతో కర్ణాటక హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది .. పవిత్ర బయిల్ పిటిషన్ కోర్టు తిరస్కరించింది.
ఇవే కాకుండా ఈ ఏడాది నటి హేమ డ్రగ్స్ కేసులో అరెస్ట్, సీనియర్ హీరోయిన్ కస్తూరి అనుకోని వివాదంతో తెలుగు ద్రవిడ వాదమని చేసిన వ్యాఖ్యలతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే ఈ సంవత్సరం ఇద్దరు రాజకీయ నాయకులు మధ్య తలెత్తున వివాదంలో అనవసరంగా హీరోయిన్ త్రిష అనుకోని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అలాగే అల్లు అర్జున్ నంద్యాల పర్యటన , ఐఫా అవార్డుల హోస్టింగ్ కారణంగా రానా, తేజసజ్జలపై కొన్ని రోజులపాటు ట్రోలింగ్ జరిగింది .. ఇలా ఈ సంవత్సరం స్టార్ హీరో హీరోయిన్లకు ఎదురైన అనుకోని వివాదాలు ఇవే.