- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .


ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా ఎక్క‌డ చూసినా పుష్ప రాజ్ గాడి హ‌వా క‌నిపిస్తోంది. పుష్ప గాడు కేవ‌లం 6 రోజుల కే ఏకంగా రు. 1000 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు కొల్ల గొట్టేశాడ‌ని నానా హంగామా చేస్తున్నారు. ఇక ఇప్పుడేదో పుష్ప పుష్ప అని ఓ ఊదరగొడుతున్నారు కానీ ... 1986 లో వచ్చిన సూపర్ స్టార్ కృష్ణ ద్విపాత్రల్లో నటించి , నిర్మాతగా, కథ , స్క్రీన్ ప్లే , ఎడిటింగ్ , దర్శకత్వం కూడా చేసిన సినిమా "సింహాసనం". ఈ సినిమా 153 ధియేటర్లలో విడుదలయి 10 రోజుల ముందే ఒక వారానికి టికెట్లు అమ్ముడుపోయాయి. అస‌లు అప్ప‌ట్లో ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీ లో ఇదో సెన్షేష‌న్ అని చెప్పాలి. అస‌లు అప్ప‌ట్లో ఓ సినిమా రిలీజ్ కు ముందే భారీ ఎత్తున థియేట‌ర్ల లో రిలీజ్ కావ‌డం తో పాటు ఏకంగా అన్ని షోల టిక్కెట్లు అన్నీ రోజుల ముందే బుక్ అవ్వ‌డం మామూలు విష‌యం కాదు.


ఇక సింహాసనం తెలుగులో మొట్టమొదటి 70 mm స్టీరియో ఫోనిక్ సినిమా గా రికార్డు ల్లోకి ఎక్కింది . ఆరు సెంటర్లలో 100 రోజులు ప్రదర్శించబడింది . ఇక సింహాస‌నం సినిమా ప్ర‌ద‌ర్శిస్తోన్న సినిమా హాళ్లు 10 రోజులదాకా కిటకిటలాడేవి. మొదటి వారంలో 1.5 కోట్లకు పైగా వసూలు చేసిన మొదటి చిత్రం ఇది. మొత్తం 4.5 కోట్లు వసూలు చేసింది. ఇది హైదరాబాద్‌లోని సింగిల్ థియేటర్‌లో అత్యధిక వసూళ్లు చేసి రికార్డు సాధించింది. ఇక ఈ సినిమాలోని పాటలైతే విడుదలైన 20 సంవత్సరాల వరకూ మోత మోగిపోయేవి. మ‌రి ఈ లెక్క‌న సింహాసనం ముందు ఈ పుష్ప రాజ్ గాడి రికార్డులు ఎల్లు బిత్తిరే అనుకోవాలేమో .. !

మరింత సమాచారం తెలుసుకోండి: