మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం  విశ్వంభర షూటింగ్లో బిజీగా ఉన్నారు .. అయితే ఈ సినిమా తర్వాత చేయబోయే సినిమాల విషయంలో చిరంజీవి కొంత స్పీడ్ పెంచారు .. ఇప్పటికే తన తర్వాతి సినిమాను అఫీషియల్ గా కన్ఫర్మ్ చేస్తున్నా మెగాస్టార్ మరి కొంతమంది దర్శకులను తన వెయిటింగ్ లిస్టులో పెట్టారు .. ప్రస్తుతం చిరు కోసం వెయిట్ చేస్తున్న దర్శకుల‌ లిస్ట్ ఇండస్ట్రీ సర్కిల్స్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక‌ విశ్వంభర షూటింగ్ చివరి దశకు చేరుకోవటంతో చిరు నెక్స్ట్ మూవీకి సంబంధించిన డిస్కషన్స్ మొదలయ్యాయి ..


ఇక ఇప్పుడు ఆ సస్పెన్స్కు పుల్ స్టాప్ పెడుతూ దసరా సినిమా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో ఓ సినిమాను ప్రకటించారు మెగాస్టార్ .. చిరంజీవి కెరియర్ లో ఇంతవరకు చేయని ఓ డిఫరెంట్ కథతో ఈ సినిమాను చేయబోతున్నారంటూ ఊరిస్తున్నారు దర్శకుడు శ్రీకాంత్. అలాగే చిరు కోసం ఓ మంచి కమర్షియల్ ఎలిమెంట్తో ఉన్న మెసేజ్ ఓరియెంటెడ్ కథను సిద్ధం చేసినట్టుగా చెప్పారు రచయిత బివిఎస్ రవి.   ఇప్పటికే ఈ కథ విన్న మెగాస్టార్ సినిమా చేయడానికి కూడా ఓకే చెప్పారు. ఠాగూర్ తర్వాత మరోసారి అలాంటి కథ కావటంతో దర్శకుడుగా ఎవరిని తీసుకోవాలన్న విషయంలో చిరు ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని టాక్ వినిపిస్తుంది ..


తాజాగా ఈ లిస్టులోకి మరో దర్శకుడు పేరు కూడా వచ్చింది.. యానిమల్ సినిమాతో  పాన్ ఇండియా దర్శకుడుగా మారిన సందీప్ రెడ్డి వంగా దర్శికత్వంలో ఓ సినిమాకు  చేసేందుకు చిరంజీవి ఓకే చెప్పారని ఫిలిం సర్కిల్స్లో ఓ టాక్ బయటకు వచ్చింది. ప్రస్తుతం ప్రభాస్ సినిమా పనుల్లో బిజీగా ఉన్న సందీప్ .. తర్వాత మెగాస్టార్ తో సినిమాను ప్లాన్ చేస్తున్నారు .. అయితే చిరంజీవితో తర్వాత చేసే దర్శకలంతా ఆయన వీరాభిమానులు కావటం ఇక్కడ మరింత హైప్ క్రియే చేస్తుందంటున్నారు అభిమానులు .

మరింత సమాచారం తెలుసుకోండి: