రష్మిక మందన్నా.. ఈ పేరు ఈ మధ్యకాలంలో బాగా వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా పుష్ప2 సినిమా రిలీజ్ తర్వాత రష్మిక మందన్నా పేరు పాన్ ఇండియా లెవెల్లో పాపులారిటీ సంపాదించుకొని జెట్ స్పీడ్ లో వైరల్ గా మారిపోతుంది . పుష్ప 2 సినిమాలో శ్రీవల్లి పాత్రలో అద్భుతమైన పర్ఫామెన్స్ కనుబరిచింది. పుష్పరాజ్ గాడి భార్య అంటే ఈ విధంగానే ఉండాలి అని ..పుష్పరాజ్ భార్యకి  సరిపడ్డ క్యారెక్టర్ రష్మిక మందన్నాది అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. మరీ ముఖ్యంగా జాతర సీన్స్ ఎపిసోడ్లో రష్మిక మందన్నా ఎంత లా పర్ఫామ్ చేసిందో అందరికీ తెలిసిందే.


ఈ క్రమంలోనే తాజాగా ఓ ప్రముఖ ఇంగ్లీష్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ టాలీవుడ్ స్టార్ హీరో బన్నీ గురించి ఓ రేంజ్ లో పొగిడేసింది. "అసలు ఇలాంటి ఒక క్యారెక్టర్ చేయాలి అంటే గట్స్ ఉండాలి అని ..అలాంటి ఒక క్యారెక్టర్ ఉన్న మనిషి బన్నీ అని.. దమ్మున్న మగాడు బన్నీ అనే రేంజ్ లో ఆమె పొగిడేస్తుంది ". దీంతో బన్నీ ఫ్యాన్స్ హ్యాపీగానే ఉన్న మిగతా హీరోల ఫాన్స్ మాత్రం మండిపడిపోతున్నారు . బన్నీ ఒక్కడితోనే నువ్వు నటించావా..? ఇన్నాళ్లు సినిమా ఇండస్ట్రీ బన్నీ లేకుండా కూడా ముందుకెళ్ళింది గా..?



చాలా మంది స్టార్స్ ఇన్నాళ్లు సినీ ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లారు. మరి వాళ్ళందరూ స్టార్స్ కాదా..? ఎంత నువ్వు ఆ సినిమాలో హీరోయిన్గా నటిస్తే మాత్రం ఈ రేంజ్ లో పొగడాలా..? ఇండస్ట్రిలో చాలామంది బన్నీ కన్నా మంచి యాక్టర్స్ ఉన్నారు అంటూ రష్మిక ని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు . అయితే రష్మిక - బన్నీని కూసింత ఎక్కువగానే పొగిడేసింది అంటున్నారు రష్మిక అభిమానులు కూడా ..బన్ని పర్ఫామెన్స్ బాగుంది కానీ అంతలా "దమ్మున్న మగాడు" అనే రేంజ్ లో పరోక్షకంగా కామెంట్ చేయాల్సిన అవసరమే లేదు అంటున్నారు . అయితే సోషల్ మీడియాలో మాత్రం ఇప్పుడు రష్మిక మందన్నా చేసిన కామెంట్స్ బాగా వైరల్ గా మారాయి. అయితే తెలిసి చేసిందో తెలియక చేసిందో అనుకోకుండా కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసి చిక్కుల్లో ఇరుకునేసింది రష్మిక..!

మరింత సమాచారం తెలుసుకోండి: