ఇండియన్ సినిమా చరిత్రలో అత్యధిక కలెక్షన్లు సాధించిన రికార్డ్ ఆమిర్ ఖాన్ దంగల్ పేరు మీదే ఉంది .. నితీష్ తివారి తెర్కక్కించిన ఈ స్పోర్ట్స్ డ్రామా 70 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించగా ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా 2000 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది .ఇక దంగల్ తర్వాత రెండో స్థానంలో బాహుబలి 2 సినిమా ఉంది .. దర్శక ధీరుడు రాజమౌళి తెర్కక్కించిన ఈ విజువల్ వండర్లో ప్రభాస్ , అనుష్క, రానా , తమన్న , రమ్యకృష్ణ వంటి వారు కీలకపాత్రలో నటించారు . ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 1800 కోట్లకు పైగా కలెక్షన్ రాబట్టింది . ఈ జాబితాలో ఉన్న మరో తెలుగు సినిమా త్రిబుల్ ఆర్ .. రాజమౌళి తెరకెక్కించిన ఈ పీరియాటికల్ యాక్షన్ మూవీలో రామ్ చరణ్ , ఎన్టీఆర్ హీరోలుగా నటించారు .. ఆస్కార్ , గోల్డెన్ గ్లోబల్ లాంటి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డులో గెలుచుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సుమారు 1390 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.
ఈ సినిమా తర్వాత కన్నడ చిత్ర పరిశ్రమను తలెత్తుకునేలా చేసిన సినిమా యాష్ హీరోగా వచ్చిన కే జి ఎఫ్ .. ఈ సినిమాకు సీక్వల్ గా వచ్చిన కే జి ఎఫ్ 2 ప్రపంచ బాక్సాఫీస్ వద్ద 1280 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది . ఇక మరో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాల తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన మరో విజువల్ వండర్ కల్కి 2898 ఏడి .. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో దీపికా పదుకొణె, అమితాబ బచ్చన్ ముఖ్యపాత్రలో నటించారు .. ఇక ఈ సినిమా కూడా ప్రపంచవ్యాప్తంగా సుమారు 1200 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమాలతో పాటు బాలీవుడ్ భాద్షా షారుక్ ఖాన్ నటించిన జవాన్ సినిమా 1148 కోట్ల వసూలు రాబట్టింది .. అంతకుముందు రిలీజ్ అయిన షారుక్ మరో సినిమా పఠాన్ కూడా 1000 కోట్లకు పైగా కలెక్షన్ రాబట్టింది.