నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం కెరీర్ పరంగా ఎలాంటి ఫామ్ లో ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఎప్పుడో ముప్ఫై ఏళ్ల క్రితం బాలయ్య కు వరుస గా మూడు సూపర్ డూపర్ హిట్లు పడ్డాయి. మళ్లీ ఇన్నేళ్లకు అఖండ - వీర సింహారెడ్డి - భగవంత్ కేసరి మూడు ఒక దానిని మించి మరొకటి హిట్ అయ్యాయి. ఇక బాలయ్య ప్రస్తుతం బాబి దర్శకత్వం లో డాకూ మహారాజ్ సినిమా లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా బాలయ్య కెరీర్ లో 109వ సినిమాగా తెరకెక్కుతోంది. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా కోసం ఫ్యాన్సంతా ఎప్పుడు నుంచో చాలా ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.
ఇక డాకూ మహారాజ్ సినిమా తో పాటు రేసులో ఉన్న సంక్రాంతి సినిమాలు నుంచి ఆల్రెడీ ఫస్ట్ సింగిల్స్ వచ్చేసాయి .. అయినా డాకూ మహారాజ్ నుంచి మాత్రం ఫస్ట్ సింగిల్ ఇంకా రాలేదు. మరి ఫైనల్ గా మేకర్స్ దీని డేట్ అయితే ఇచ్చేశారు .. దీంతో నందమూరి ఫ్యాన్స్ తో పాటు బాలయ్య అభిమానుల ఆనందానికి అవధులే లేవు .. తాజా సమాచారం ఈ సాంగ్ ని మేకర్స్ డిసెంబర్ 14న రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ మెంట్ ఇచ్చేశారు.
ఇక ఇదొక పవర్ఫుల్ ట్రాక్ అంటూ కూడా క్లారిటీ ఇచ్చారు. ఇక దీని ప్రోమో ని రేపు డిసెంబర్ 13 ఉదయం 10 గంటల 8 నిమిషాలకి వదలబోతున్నట్టుగా అనౌన్స్ మెంట్ ఇచ్చారు. మరి బాలయ్యకి థమన్ ఎస్ ఎస్ ఎలాంటి సంగీతం అందించాడో చూడాలి .. దీనితో డాకు మహారాజ్ ఆల్బమ్ పై కూడా సాలిడ్ హైప్ అయితే ఉంది.