నిన్నగాక మొన్న చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన వాళ్లు ఇప్పుడు వెండి తేరపై హీరోయిన్లుగా యాక్టర్లుగా అదరగొడుతున్నారు .. ఆ చైల్డ్ ఆర్టిస్టులే వీరే అని చెప్పడం అసలు నమ్మశక్యం కావడం లేదు .. ముఖ్యంగా అమ్మాయిలైతే ఐదు ఆరు సంవత్సరాల లోనే హీరోయిన్ల గా మారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు . అలా హీరో హీరోయిన్స్ ఐన చైల్డ్ ఆర్టిస్టులు టాలీవుడ్ లో చాలా మంది ఉన్నారు .. టాలీవుడ్ స్టార్ హీరో కింగ్ నాగార్జున నటించిన సోగ్గాడే చిన్నినాయన సినిమాలో నటించిన ప్రణవి కూడా ఇప్పుడు హీరోయిన్గా మారిపోయింది.


2016లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సోగ్గాడే చిన్నినాయన బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌ గా నిలిచి కలెక్షన్ సునామీ సృష్టించింది .. అప్పట్లో ఈ సినిమాకు పోటీగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో సినిమా కూడా రిలీజ్ అయింది .. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ రెండు సినిమాల్లో సోగ్గాడే చిన్నినాయన విన్నర్ గా నిలిచింది .. ఆ రోజుల్లోనే ఈ సినిమా 50 కోట్లకు పైగా షేర్ ను సాధించి నాగార్జున కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డులు క్రియేట్ చేసింది .


అయితే ఈ సినిమాలో మెయిన్ ఆర్టిస్టులతో పాటు చాలామంది చైల్డ్ ఆర్టిస్టులు కూడా సినిమాలో కనిపించి సందడి చేశారు .. ఇక వారిలో ప్రణవి కూడా ఒకరు .. అయితే ఇప్పుడు ఈమె హీరోయిన్గా మారిపోయింది .. టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీ కొడుకు సంజయ్ కుమార్ హీరోగా ‘స్లం డాగ్ హస్బెండ్’ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది .. ఈ చిన్నదాని లుక్స్ చూసి నెటిజన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు .. బాబోయ్ మరి ఇంతలా మారిపోయింది ఏంట్రా బాబు అని కామెంట్లో పెడుతున్నారు .. తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: