అగ్రనటుడు మంచు మోహన్ బాబు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. మంచు ఫ్యామిలీలో చోటు చేసుకున్న కుటుంబ కలహాలు నేపథ్యంలో మోహన్ బాబుకు బీపీ పెరిగింది. దీంతో ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు మంగళవారం రాత్రి ఆయనను మంచు విష్ణు వ్యక్తిగత సిబ్బంది హైదరాబాద్ కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరారు. రెండు రోజుల పాటు మోహన్ బాబు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. అయితే గురువారం మోహన్ బాబుకు వైద్యులు నిర్వహించిన అన్ని పరీక్షలలో నార్మల్ అని రావడంతో వైద్యులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన మోహన్ బాబు అనంతరం జర్నలిస్టుపై దాడి గురించి ఆడియో విడుదలచేశారు. జర్నలిస్టులను కొట్టాలని దైవ సాక్షిగా అనుకోలేదని ఆ ఆడియోలో వెల్లడించారు. తన ఇంట్లోకి దూసుకొస్తున్నది జర్నలిస్టులా?లేక మరేవరైనానా? అన్నది తనకు తెలియదని చెప్పుకొచ్చారు. ఆవేశంలో చూసుకోకుండా కొట్టానని మోహన్‌బాబు తన వివరణ ఇచ్చారు. నేను మీడియా ప్రతినిధిని కొట్టినందుకు చింతిస్తున్నాను అంటూ మోహన్‌ బాబు మొత్తం 11 నిమిషాల ఆడియోను విడుదల చేశారు.మా కుటుంబంలో సమస్యలు నెలకొన్నాయి. కుటుంబ సమస్యల్లో ఎవరైనా జోక్యం చేసుకోవచ్చా..?అని మోహన్ బాబు ప్రశ్నించారు. 'ప్రజలు, రాజకీయ నాయకులు ఇది బాగా ఆలోచించాలి. మీడియాను అడ్డుపెట్టుకొని నాపై దాడి చేసే అవకాశం ఉందని ఆలోచించా.

చీకట్లో ఘర్షణ జరిగింది. నేను కొట్టిన దెబ్బ అతనికి తగిలింది. మీడియా ప్రతినిధికి తగిలిన దెబ్బకు నేను బాధపడుతున్నాను'అని మోహన్ బాబు ఆడియోలో వెల్లడించారు. నేను కొట్టినదాని గురించే మాట్లాడుతున్నారు. కానీ నా గురించి ఎవరూ ఆలోచించడం లేదు. నేను సినిమాల్లో నటించాను తప్ప నిజజీవితంలో నటించే అవసరం నాకు లేదు'అంటూ మోహన్ బాబు ఆడియోలో వెల్లడించారు.'నీతిగా బతకాలన్నదే నా ఆలోచన. నేను అసభ్యంగా ప్రవర్తించి ఉంటే నా మీద 50 కేసులు పెట్టవచ్చు. నా బిడ్డే నా ప్రశాంతతను చెడగొడుతున్నాడు'అని మోహన్ బాబు ఆడియోలో ఆవేదన వ్యక్తం చేశారు.మా కుటుంబంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించుకుంటాం. మేం కూర్చొని మాట్లాడుకుంటాం. ఏదో ఒక రోజు మా సమస్య పరిష్కారం అవుతుంది. మా కుటుంబ సభ్యుల గొడవకు మధ్యవర్తులు అవసరం లేదు'అని మోహన్ బాబు తెలిపారు. 'నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను. అవన్నీ మరిచిపోయి నేను కొట్టిన విషయం ప్రస్తావిస్తున్నారు. ప్రచారం చేస్తున్నారు.నేను చేసిన తప్పును సమర్ధించుకోవడం లేదు. కానీ ఏ సందర్భంలో కొట్టానో ఆలోచించాలి'అని మంచు మోహన్ బాబు వెల్లడించారు.'మీకు టీవీలు ఉండొచ్చు. నేను కూడా రేపు టీవీ పెట్టొచ్చు. నేను మీడియా ప్రతినిధిని కొట్టినందుకు చింతిస్తున్నాను'అని మోహన్ బాబు ఆ ఆడియోలో వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: