ఇండియన్ సినిమా పరిశ్రమలలో అత్యంత క్రేజ్ కలిగిన ఇండస్ట్రీలలో బాలీవుడ్ , టాలీవుడ్ , కోలీవుడ్ , శాండిల్ వుడ్ , మాలీవుడ్ మంచి గుర్తింపును సంపాదించుకున్నాయి. ఇకపోతే ఈ మధ్య కాలంలో ప్రతి ఇండస్ట్రీ కూడా 1000 కోట్ల కలెక్షన్లను అందుకునే సినిమాలను రూపొందించాలి అనే దానిపై అత్యంత ఆసక్తిని చూపిస్తూ వస్తున్నాయి. కానీ కొన్ని ఇండస్ట్రీ సినిమాలు మాత్రమే ఇప్పటి వరకు 1000 కోట్ల మార్క్ కలెక్షన్లను అందుకున్నాయి. మరి అందులో ఈ క్రేజ్ కలిగిన 5 ఇండస్ట్రీలో ఏ ఇండస్ట్రీ నుండి ఎన్ని 1009 కోట్ల సినిమాలు వచ్చాయి. ఏ ఇండస్ట్రీ నుండి ఇప్పటివరకు 1000 కోట్ల సినిమా రాలేదు అనే వివరాలను తెలుసుకుందాం.

టాలీవుడ్ : ఇప్పటివరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో అత్యధిక వెయ్యి కోట్లు వచ్చిన ఇండస్ట్రీ గా టాలీవుడ్ ముందు వరుసలో ఉంది. మొదటగా టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వచ్చిన బాహుబలి 2 మూవీ 1000 కోట్ల కలక్షన్లను అందుకోగా , ఆ తర్వాత ఆర్ ఆర్ ఆర్ మూవీ 1000 కోట్ల కలెక్షన్లను అందుకుంది. ఆ తర్వాత కల్కి 2898 AD సినిమా 1000 కోట్ల కలక్షన్లను అందుకుంది. ఇక తాజాగా పుష్ప పార్ట్ 2 మూవీ 1000 కోట్ల కలెక్షన్ లను అందుకుంది. ఇప్పటివరకు టాలీవుడ్ సినిమాలలో నాలుగు సినిమాలు 1000 కోట్ల కలెక్షన్లను అందుకున్నాయి.

బాలీవుడ్ : టాలీవుడ్ తర్వాత స్థానంలో బాలీవుడ్ ఇండస్ట్రీ నుండి ఎక్కువ 1000 కోట్ల సినిమాలు వచ్చాయి. బాలీవుడ్ ఇండస్ట్రీ నుండి మొదటగా దంగల్ 1000 కోట్ల కలెక్షన్ లను అందుకోగా , ఆ తర్వాత పఠాన్ సినిమా వేయి కోట్ల కలెక్షన్ లను అందుకుంది. ఆ తర్వాత జవాన్ శర్మ వెయ్యి కోట్ల కలెక్షన్ లను అందుకుంది. మొత్తంగా బాలీవుడ్ ఇండస్ట్రీ నుండి ఇప్పటివరకు మూడు సినిమాలు 1000 కోట్ల కలెక్షన్లను అందుకున్నాయి.

శాండిల్ వుడ్ : ఈ ఇండస్ట్రీ నుండి కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమా 1000 కోట్ల కలెక్షన్లను అందుకుంది.

కోలీవుడ్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీల నుండి ఇప్పటివరకు ఒక్క 1000 కోట్ల సినిమా కూడా రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: