* నందమూరి బాలయ్య హీరోగా వీర‌సింహా రెడ్డి

* గోపిచంద్ మలినేని దర్శకత్వం


నందమూరి బాలయ్య ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతున్నాడు. వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నాడు. రాజకీయాలు అదే సమయంలో ఇండస్ట్రీలో... తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకునేలా ముందుకు నందమూరి బాలయ్య. ఈ తరుణంలోనే చాలా సినిమాలు హిట్ కొట్టుకొని..సక్సెస్ అవుతున్నాడు. వాస్తవంగా నందమూరి బాలయ్య సినిమా కచ్చితంగా సంక్రాంతి బరిలో ఉండేలా... ప్లాన్ చేసుకుంటాడు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ వస్తే... సినిమాలు చూసేందుకు జనాలు ఆసక్తి చూపిస్తారు. అందుకే నందమూరి బాలయ్య సంక్రాంతిపండుగను టార్గెట్ చేసి రిలీజ్ చేసుకుంటారు. ఈ తరుణంలోనే 2023 అంటే గత రెండేళ్ల కింద వచ్చిన సంక్రాంతి పండుగ కానుకగా వీరసింహారెడ్డి సినిమాలు రిలీజ్ చేశారు. వీర సింహారెడ్డి సినిమాలో...నందమూరి బాలయ్య హీరోగా చేయగా... హీరోయిన్ గా... హనీ రోజ్ , శృతిహాసన్ మెరిసారు.

ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపించాడు బాలయ్య. తండ్రి అలాగే కొడుకు పాత్ర అన్నట్లుగా ఈ సినిమా కొనసాగుతుంది. వీర సింహారెడ్డి సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించాడు. ఈ సినిమా దాదాపు 100 కోట్లతో తెరకెక్కింది. అయితే 100 కోట్లతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ ముందు సక్సెస్ అయింది. ఏకంగా 134 కోట్లు సంపాదించింది.

 అటు ఓటిటి రైట్స్ కు కూడా భారీ ధరనే వచ్చింది. ఈ సినిమా రాయలసీమ, ఫ్యాక్షన్ నేపద్యంలో వచ్చింది. ఈ సినిమాలో బాలయ్య సరసన శృతిహాసన్ అలాగే హనీ రోజు ఇద్దరూ నటించారు. అదే సమయంలో... బాలయ్య చెల్లెలిగా వరలక్ష్మి శరత్ కుమార్ అదరగొట్టారు. క్రాక్ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ పాత్ర సక్సెస్ కావడంతో... వీర సింహారెడ్డి సినిమాలో కూడా ఆమెను తీసుకున్నారు గోపీచంద్ మలినేని. ఇక ఈ సినిమాకు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తమన్ అదరగొట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: