టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా హిట్ సినిమా “ పుష్ప 2 ది రూల్ ” కోసం మూడేళ్లు గా ఇండియన్ సినీ ప్రేమికులు ఎంత ఆసక్తి తో వెయిట్ చేశారో అందరం చూశాం. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఇండియన్ సినిమా దగ్గర ఫాస్టెస్ట్ గా రు. 1000 కోట్ల సినిమాగా నిలిచి తిరుగులేని రికార్డు సెట్ చేసింది. కేవలం 6 రోజుల్లోనే పుష్ప 2 ది రూల్ ఏకంగా రు. 1000 కోట్ల వసూళ్లు సాధించేసింది. భారతీయ సినిమా చరిత్ర లోనే ఇంత పాస్ట్ గా రు. 1000 కోట్ల క్లబ్ లో చేరిన సినిమా గా పుష్ప 2 రికార్డుల్లో కి ఎక్కింది.
అయితే ఈ భారీ హిట్ తో మేకర్స్ ఢిల్లోలో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లోనే పుష్ప 2 పై ఆసక్తికర అంశాలు కొన్ని మేకర్స్ షేర్ చేసుకోవడం విశేషం. పుష్ప 2 క్లైమాక్స్ ఎపిసోడ్ పై ఇంట్రెస్టింగ్ అంశాలు ఇప్పుడు షేర్ చేసుకున్నారు. ఇక ఈ ఎపిసోడ్ ను ఏకంగా 32 రోజులు పాటు షూట్ చేశారట. అలాగే ఈ అన్ని రోజుల్లో కూడా అల్లు అర్జున్ తాళ్ల సాయంతోనే చాలా కష్టం గా ఈ యాక్షన్ ఎపిసోడ్ అంతటినీ చేశాడు అని మేకర్స్ చెప్పారు.
ఇక ఆ టైం లో అక్కడ ఏమైనా తేడా జరిగితే అక్కడే ఫిజియో స్పెషలిస్ట్ లు కూడా ఉండి మరీ పని చేశారట. దీంతో అల్లు అర్జున్ డెడికేషన్ ని ను ప్రతి ఒక్కరు హ్యాట్సాఫ్ చెపుతున్నారు. ఈ విషయాన్ని నిర్మాత రవి శంకర్ చెపుతున్నారు. ఇక పుష్ప 2 లాంగ్ రన్ లో ఏ స్థాయిలో వసూళ్లు సాధిస్తుందో ? చూడాలి.