టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ సంబరాల ఏటిగట్టు సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానున్నారు. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కి జోడీగా ఐశ్వర్య లక్ష్మి నటిస్తుంది. సంబరాల ఏటిగట్టు సినిమాను ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌ పై చైతన్య రెడ్డి, నిరంజన్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో రానున్నట్లు మూవీ మేకర్స్ తెలిపారు. ఈ మూవీ 1947 హిస్టరీ బ్యాక్‌డ్రాప్‌ లో తెరకెక్కబోతుంది.
అయితే తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. ఆ టీజర్ ఈవెంట్ కు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ గా వచ్చారు. మెగా హీరో రామ్ చరణ్ ఈవెంట్ లో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ పై ఫన్నీ కామెంట్స్ కూడా చేశారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. తేజు గాడి ప్రేమ చాలా బండ ప్రేమ అని అన్నారు. ఒకసారి పట్టుకుంటే ఊపిరి కూడా ఆడదు అంత గట్టిగా తేజు పట్టుకుంటాడని చెప్పుకొచ్చారు. బండ ఎంత గట్టిగా ఉంటుందో.. అంత గట్టిగా ప్రేమిస్తాడని తెలిపారు. అయితే సాయి ధరమ్ తేజ్ ఈ బండ ప్రేమ మగవాళ్లకి మాత్రమే చూపిస్తున్నాడు కానీ ఆడవాళ్లకు చూపించట్లేదని అన్నారు. ఈవెంట్ లో కూర్చున్న తేజు అమ్మ కూడా రోజు ఇదే మొత్తుకుంటుందని.. ఇదే కోరుటుందని రామ్ చరణ్ తెలిపారు. వాడికి ఎలా అయితే మీరు జన్మనిచ్చారో అలాగే వాడికి పెళ్లి చేసే బాధ్యత కూడా మీదే అంటూ చెప్పుకొచ్చారు. ఈ సినిమాని పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాలని విషెస్ తెలిపారు. సినిమా తర్వాత ఒక మంచి న్యూస్ ఇవ్వాలని మేము అందరం కోరుకుంటున్నామని అన్నారు. ఆల్రెడీ పెద్దాడివి అయిపోయావ్, తొందరగా పనులు కానిచ్చేయ్ అంటూ మెగా హీరో సరదాగా నవ్వులు పూయించారు. అలాగే సంబరాల ఏటిగట్టు సినిమా గురించి మాట్లాడుతూ.. తేజ్ ఊచకోత ఎలా ఉంటుందో మీరు చూడబోతున్నారు అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: