సీనియర్ హీరో వెంకటేష్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. వెంకటేష్ తన సినిమాల ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎక్కువగా  ఆకట్టుకుంటాడు. ఈ హీరో ఎక్కువగా ఫ్యామిలీ సినిమాలకే ప్రాముఖ్యతను చూపిస్తారు. ఇక వెంకటేష్ నటించిన తాజా చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే ప్రేక్షకులకు పండగ అనే చెప్పవచ్చు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వెంకటేష్ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు "సంక్రాంతికి వస్తున్నాం" సినిమాతో రానున్నాడు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లు గా నటిస్తున్నారు.


బీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా.... శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి 'గోదారి గట్టు' పాటను విడుదల చేశారు. ఈ పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. చిత్రబృందం తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా నుంచి సెకండ్ సింగిల్ ప్రోమోను సోమవారం రిలీజ్ చేశారు.


ఈరోజు విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ప్రోమో....'నా లైఫ్ లోనున్న ఆ ప్రేమ పేజీ దీనా... పేజీలో రాస్తున్న అందాల ఆ పేరు మీనా' అంటూ సాగుతున్న ఈ పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ ప్రోమో చివరిలో హ్యాపీ బర్త్డే వెంకటేష్ అని రాసి ఉంది. వెంకటేష్ పోలీస్ యూనిఫామ్ లో ఉన్న లుక్ ప్రోమోకు మరింత హైప్ ను క్రియేట్ చేస్తుంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. "సంక్రాంతికి వస్తున్నాం" సినిమా ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.


కాగా, 2025 సంక్రాంతి రేసులో ఇప్పటికే రామ్ చరణ్ హీరోగా చేసిన "గేమ్ చేంజర్", నందమూరి బాలకృష్ణ సినిమా "డాకు మహారాజ్" సినిమాలు ఉన్నాయి. ఈ రెండింటితో పాటు తాజాగా "సంక్రాంతి వస్తున్నాం" సినిమా కూడా రేసులోకి వస్తుంది. 2019లోనూ ఇదే తరహాలో వెంకటేష్, బాలకృష్ణ, రామ్ చరణ్ సినిమాలతో సంక్రాంతి రేసులో పోటీపడ్డారు. మళ్లీ ఇప్పుడు 2005 సంవత్సరంలో ఈ ముగ్గురు హీరోలు పోటీ పడడం ఆసక్తిని కలిగిస్తోంది. ఈ ముగ్గురు హీరోలలో ఏ సినిమా ముందు వరుసలో నిలుస్తుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: