మోహన్ బాబు తప్పు చేసి క్షమాపణలు చెప్పారు. ఈ వివాదం విషయంలో నెటిజన్ల నుంచి మోహన్ బాబుకు సైతం మద్దతు ఒకింత ఎక్కువగానే ఉంది. అయితే మోహన్ బాబు స్థాయిని తగ్గించేలా కథనాలను వండి వార్చిన న్యూస్ ఛానెళ్లు క్షమాపణలు చెబుతాయా అనే చర్చ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. ప్రతి కుటుంబంలో చిన్నచిన్న సమస్యలు ఉండటం సాధారణం అనే సంగతి తెలిసిందే.
మోహన్ బాబు వయస్సుకు అయినా న్యూస్ ఛానెళ్లు గౌరవం ఇవ్వాల్సిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నెటిజన్లు చేస్తున్న కామెంట్ల నేపథ్యంలో ఇకనైనా పరిస్థితులలో మార్పు వస్తుందా అనే చర్చ జరుగుతోంది. మా ఇంటి గొడవను మేమే పరిష్కరించుకుంటామని మోహన్ బాబు చెబుతున్నారు. మోహన్ బాబు వివాదం విషయంలో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకుంటాయో చూడాలి.
మంచు విష్ణు, మంచు మనోజ్ కెరీర్ పరంగా ఎలాంటి ప్రాజెక్ట్ లతో ముందుకొస్తారో చూడాల్సి ఉంది. మంచు విష్ణు కన్నప్పతో పాన్ ఇండియా హిట్ అందుకుంటాననే నమ్మకంతో ఉన్నారు. మంచు ఫ్యామిలీకి ఊహించని స్థాయిలో క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. సొంత బ్యానర్ల ప్రాజెక్ట్ లలో మంచు హీరోలు ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటిస్తూ ఉండటం గమనార్హం. భవిష్యత్తులో వివాదాలకు జోక్యం చేసుకోకుండా మోహన్ బాబు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. మోహన్ బాబు కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉంటాయో చూడాల్సి ఉంది.