ప్రస్తుతం సినీ ప్రియులు పుష్ప 2 హవా గురించి గట్టిగానే మాట్లాడుకుంటున్నారు. అల్లు అర్జున్‌ సుకుమార్‌  కాంబినేషన్‌లో వచ్చిన ఈ పాన్ ఇండియా సినిమా, విడుదలైన అన్ని ప్రాంతాల్లో భారీ కలెక్షన్లు రాబడుతూ దూసుకుపోతోంది.ముఖ్యంగా నార్త్ ఇండియా మార్కెట్లో వీకెండ్ ముగిసిన తర్వాత సినిమా వసూళ్లు కొంచెం తగ్గినట్లు వార్తలు వచ్చాయి. ఇక, మేకర్స్ మాత్రం అంతర్జాతీయ మార్కెట్‌లో పెరిగిన వసూళ్ల కారణంగా మొత్తం మొత్తం రూ.1002 కోట్లుగా ప్రకటించారని అర్థమవుతోంది. వివాదాల పక్కనపెడితే, పుష్ప 2 కలెక్షన్లు పట్ల ప్రేక్షకుల ఆసక్తి తగ్గడం లేదు. సినిమా సాధించిన ఘనతలను లెక్కించడంలో అతి చేసినా, అల్లు అర్జున్, సుకుమార్ జోడీ తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించారనే విషయం స్పష్టమవుతోంది.ఇదిలావుండగ రీసెంట్ గా భారీ అంచనాలతో వచ్చిన సినిమా కంగువ. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయం సాధిస్తుంది అని చాలామంది అంచనా వేశారు. ఈ సినిమా నిర్మాత జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ ఈ సినిమా కోలీవుడ్ బాహుబలి అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా 1000 కోట్లు వసూలు చేస్తుందా అని అడిగితే ఈ సినిమా 2000 కోట్లు వసూలు చేసే అవకాశం కూడా ఉంది అని చెప్పుకొచ్చాడు. అలానే ఈ సినిమా గురించి మాట్లాడుతూ కంగువ పార్ట్ వన్ రిలీజ్ అయినప్పుడు కొన్ని సినిమాలు పోటీగా రిలీజ్ అవ్వచ్చు. కానీ పార్ట్ 2 రిలీజ్ అయినప్పుడు మాత్రం మిగతా సినిమాలన్నీ పోస్ట్ పోన్ అవుతాయి అనే రేంజ్ లో కూడా మాట్లాడాడు. ఇకపోతే బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా కంప్లీట్ డిజాస్టర్ గా మిగిలిపోయింది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో కంగువ టార్గెట్ ను పుష్ప ఫినిష్ చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: