ప్రస్తుతం బన్నీ పోలీసుల అదుపులో ఉన్న నేపథ్యంలో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది. పోలీసులు అల్లు అర్జున్ పై బీ.ఎన్.ఎస్ 105, 118 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బన్నీ థియేటర్ కు వచ్చిన సమయంలో భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు భావిస్తున్నారు. బన్నీ అరెస్ట్ వార్తలు ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యాయి.
పుష్ప ది రూల్ మూవీ బెనిఫిట్ షోలు పరోక్షంగా రేవతి మృతికి కారణమయ్యాయి. థియేటర్ ఎంట్రీ, ఎగ్జిట్ లో ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసి ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదు. పోలీసులకు సైతం బన్నీ ఈ థియేటర్ కు వస్తారనే సమాచారం లేదని భోగట్టా. పోలీసులు బన్నీని అదుపులోకి తీసుకోగా బన్నీకి పదేళ్ల జైలు శిక్ష పడుతుందని ప్రచారం జరుగుతోంది.
అల్లు అర్జున్ అరెస్ట్ కు సంబంధించి కొన్ని వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో బన్నీ టైమ్ అస్సలు బాలేదని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. బన్నీ ఈ వివాదం నుంచి బయటపడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సెలబ్రిటీలు బయటకు వెళ్లిన సమయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అరెస్ట్ బన్నీ మెంటల్ హెల్త్ పై కొంతమేర ప్రభావం చూపే ఛాన్స్ ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.