చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగు చిత్ర పరిశ్రమకు వీరు నాలుగు స్థంబాల వంటివారు అనడంలో అతిశయోక్తి లేదు. ఎన్టీఆర్, కృష్ణ, ఏఎన్నార్, కృష్ణం రాజు, శోభన్ బాబు తర్వాత చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ హవా కొనసాగింది... ఇంకా కొనసాగుతోంది అని చెప్పుకోవచ్చు. వీరి మధ్య పోటీ 90వ దశకంలో అయితే పీక్ స్టేజికి చేరింది. వీరు నలుగురు 90వ దశకంలో పోటా పోటీగా సినిమాల్లో నటిస్తూ ఒకరిని మించి మరొకరు, తెలుగు చిత్ర సీమకు సూపర్ హిట్స్ అందించారు. ఈ క్రమంలోనే 1994లో నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున బాక్సాఫీస్ వద్ద పోటీ పడడం జరిగింది. అప్పటి సంగతులు గుర్తు చేసుకుంటే ఇప్పటి సినిమా ఫాన్స్ ఓ లెక్కకాదు అనిపిస్తుంది.

అవును, అప్పట్లో అగ్ర హీరోల సినిమాలు థియేటర్లలో రిలీజైన రోజు హడావుడి అంతాఇంతా కాదు. స్వయంగా చూసినవారు, ఇప్పటి సినిమా పిచ్చి కంటే అప్పటి సినిమా పిచ్చి పీక్స్ లో ఉందని చెబుతూ ఉంటారు. ఇక అప్పుడు సరిగ్గా వారం రోజుల వ్యవధిలో బాలయ్య, నాగార్జున నటించిన చిత్రాలు విడుదలయ్యాయి. ఆ 2 చిత్రాలు ఈ ఇద్దరి హీరోల కెరీర్లోనే చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రాలు అయ్యాయని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. అవును, నందమూరి బాలయ్య నటించిన "భైరవ ద్వీపం" చిత్రం సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ఏప్రిల్ 14న 1994లో విడుదలయింది. కాగా భైరవద్వీపం చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. అప్పట్లోనే దాదాపు 8 కోట్ల వరకు వసూళ్లు సాధించిందని సమాచారం. 1994 ఏడాదికి ఇదే బిగ్గెస్ట్ హిట్ అని అప్పట్లో మీడియా వార్తలు రాసింది.

ఇక దాదాపు అందరూ అలానే అనుకున్నారు. కానీ వారం రోజుల వ్యవధిలో విడుదలైన నాగార్జున "హలో బ్రదర్" చిత్రం భైరవ ద్వీపం రికార్డులు తిరగ రాస్తూ, దాదాపు 9 కోట్ల వరకు వసూళ్లు సాధించింది అంటే మీరు నమ్ముతారా? అయితే ఇక్కడ చిరంజీవి సినిమాకి కూడా నాగార్జున తన సినిమా ద్వారా చెక్ పెట్టాడు. అవును... అప్పటి వరకు అత్యధిక కెలెక్షన్లు నమోదు చేసిన సినిమాగా పేరు ఉన్న ఘరానామొగుడు రికార్డుకి హలో బ్రదర్ దాదాపుగా చేరువగా వెళ్ళింది. దాంతో చిరంజీవి రికార్డుకి చెమటలు పట్టించినంత పని అయిందని అప్పటి మీడియాలలో న్యూస్ వచ్చిందట. అయితే కాస్త దగ్గరకి వచ్చి ఇండస్ట్రీ హిట్ కి కొద్ది దూరంలో నిలిచిపోయిందట హలో బ్రదర్ సినిమా. ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ చిత్రంగా తెరకెక్కిన హలో బ్రదర్ సినిమా అప్పట్లో మాస్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: