సంక్రాంతి పండగ అంటే ప్రజలతో పాటు సినిమా ఇండస్ట్రీ కూడా ఓ పెద్ద పండుగ .. ఈ సమయంలో అగ్ర హీరోలు తమ సినిమాలు కూడా రిలీజ్ చేయాలని పోటీపడుతూ ఉంటారు .. ప్రధానంగా తెలుగు చిత్ర పరిశ్రమలో సంక్రాంతి హీరోగా బాలయ్యకు అదిరిపోయే రికార్డు ఉంది .. ఇప్పటివరకు బాలయ్య సినిమాలు సంక్రాంతికి వచ్చి ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి .. వచ్చే సంక్రాంతికి కూడా బాలయ్య డాకు మహారాజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు .
ఇదే క్రమంలో నటసింహం బాలకృష్ణ 2018 సంక్రాంతికి కూడా జై సింహా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సంక్రాంతి హీరో అనిపించుకుని భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు .. అయితే ఈ సినిమాతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి మూవీ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది .. పవన్ కళ్యాణ్ కు పోటీగా వచ్చి బాలకృష్ణ జై సింహా తో భారీ హిట్‌ను తన ఖాతలో వేసుకున్నాడు .. ఈ సినిమాను కోలీవుడ్ దర్శకుడు కె.ఎస్ రవికుమార్ తెరకెక్కించాడు . ఈ సినిమాలో బాలయ్యకు జంటగా నయనతార, నటాషా దోషి హీరోయిన్లుగా నటించారు .. జై సింహ మాస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది .. ఈ సినిమాలో బాలయ్య చెప్పే డైలాగ్ లు కూడా బాగా పిలాయి. 2019 సంక్రాంతికి జై సింహతో బాలయ్య విన్నర్గా నిలిచాడు.