ఇక అసలు విషయంలోకి వెళితే, తండ్రి మోహన్ బాబు, మనోజ్ మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుంది. ఆస్తుల విషయంలో ఇరువురి మధ్య కొట్లాటకు కారణం అయినట్లు ఇప్పటికే బయటకి పొక్కింది. ఇక లోగుట్టు పెరుమాళ్ళకెరుక గానీ, ఈ వివాదానికి కారణం జల్ పల్లిలో మోహన్ బాబు నిర్మించుకున్న ఇల్లే అని ప్రధానంగా ప్రచారం జరుగుతోంది. ఈ ఇల్లు తనకు ఇవ్వాలని మనోజ్ గొడవ చేస్తున్నట్లు గుసగుసలు వినబడుతున్నాయి. మరోవైపు తాను ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇల్లును ఇచ్చేది లేదని మోహన్ బాబు తేల్చి చెప్పినట్లు సమాచారం. దానికి మోహన్ బాబు రిలీజ్ చేసిన వీడియోలో సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
ఇకపోతే, ఈ ఇంటికి సంబంధించి మోహన్ బాబు ముద్దుల కూతురు మంచు లక్ష్మి గతంలో హోం టూర్ వీడియో చేసిన సంగతి విదితమే. అయితే కుటుంబ కలహాల నేపథ్యంలో సదరు వీడియో మరోసారి వైరల్ కావడం బాధాకరం. ఇక ఈ భవనం చూస్తే, ఇంద్ర భవనంలా వుంది అని అనక మానరు. మోహన్ బాబు గతంలో హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లోని నివాసంలో ఉండేవారు. ఈ ఇంటిని మంచు లక్ష్మికి రాసి ఇచ్చేయగా తన శేష జీవితం రణగొణ ధ్వనులకు దూరంగా ఉండి, ప్రశాంతంగా ఉండాలని మోహన్ బాబు నిర్ణయం తీసుకొని రంగారెడ్డి జిల్లా శంషాబాద్ దగ్గర లోని జల్ పల్లిలో భూమిని కొనుగోలు చేసి, అక్కడ తన అభిరుచికి తగినట్లుగా అద్భుతమైన ఇంటిని నిర్మించుకున్నారు. ఇక ఆ ఇంటి సమీపంలో పెద్దగా నివాసాలు లేకపోవడం చేతన బయట నుంచి చూస్తే ఆ ఇల్లు ఓ ప్యాలెస్ లా కనిపిస్తుంది.
ఇక వాస్తవానికి అయితే, కొద్ది సంవత్సరాల క్రితమే మోహన్ బాబు తన ఆస్తులను తన వారసులకు పంచిపెట్టినట్టుగా ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే హైదరాబాద్ ఫిల్మ్ నగరల్ లోని నివాసాన్ని మంచు లక్ష్మికి ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి మోహన్ బాబు జల్ పల్లిలోనే నివాసం ఉంటున్నారు. ఈ ఇంట్లో కొన్ని సినిమా షూటింగులు కూడా జరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా ఇప్పుడు ఈ ఇల్లు కావాలని మనోజ్ కొట్లాడుతున్నట్లు గుసగుసలు వినబడుతున్నాయి.