నవ్వుల రారాజు రేలంగి ఇప్పటి జనరేషన్ వారికి పెద్దగా తెలియదు కానీ .. అంతకుముందు జనరేషన్లో వారికి ఆయన బ్రహ్మానందాన్ని మించిన అగ్ర బ్రహ్మానందం .. ఆయన సినిమాలో కనిపించి ఏం చేయకుండా కనిపించి నవ్వులు పూయించగలరు . .. ఎన్టీఆర్ , నాగేశ్వరరావు వంటి అగ్ర‌ నటులతో రేలంగి నటించారు .. ఆయన పూర్తి పేరు రేలంగి వెంకటరామయ్య .. 1910 ఆగస్టు 9న తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం సమీపంలోని రావులపాడు అనే గ్రామంలో రామదాసు, అచ్చమ్మల దంపతులకు ఒక్కగానొక కొడుకుగా రేలంగి జన్మించారు .. మొదట రంగస్థలం నటుడుగా ఎన్నో నాటకాలలో నటించిన రేలంగి 1935 లో వచ్చిన కృష్ణ తులాభారం అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు ..


సి. పుల్లయ్య ఈ సినిమాకు దర్శకుడు .. ఆ తర్వాత కీలుగుఱ్ఱం, గుణసుందరి కథ , పాతాళభైరవి , పెద్దమనుషులు , మాయాబజార్ , మిస్సమ్మ వంటి ఎన్నో విజయవంతమైన సినిమాలో నటించారు రేలంగి .. నటుడుగా నాలుగు దశాబ్దాల పాటు దాదాపు 300కు పైగా సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించారు .. అలాగే ఎన్నో మరుపురాని పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకుల మనసులో చెరిగిపోని ముద్ర వేసుకున్నారు.  అయిన పెళ్లి విషయానికి వస్తే .. పైన కనిపిస్తున్నదే ఆయన పెళ్లి ఆహ్వాన పత్రిక .. 1933 లో ఆయన పెళ్లి జరిగింది .. ఈ వివాహానికి సంబంధించి చాలా పెద్ద కథ జరిగిందని అప్పట్లో అంటూ ఉంటారు .. ఆ రోజుల్లో రేలంగిని పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలు రేలంగికి పిల్లనిచ్చేందుకు పెద్దలు క్యూ కట్టే వారట.. కానీ తన తండ్రి రామదాసు మాత్రం తనకు తినడానికి గత్యంతరం లేని సమయంలో ఎంతగానో గౌరవం ఇచ్చి పిల్లనిచ్చిన తన బావమరిది చేబోలి వీరస్వామి కూతుర్నే తన కొడుకు ఇచ్చి పెళ్లి జరిపించారు ..


ఇక అప్పటికి తన బావమరిది వీరస్వామి బ్రతికి కూడా లేరు. అలాగే ఆ పెళ్లి శుభలేఖ పై కూడా చేబోలు వీరాస్వామి తనయుడు సాహెబు గారి ప్రథమ సోదరి అని రాసి ఉండటం గమనించవచ్చు .. 1933 డిసెంబర్ 8వ తేదీన రేలంగి , బుచ్చమ్మల  పెళ్లి పెంటపాడు గ్రామంలో వధువు ఇంట్లో జరిగింది ..ఇంకా ఈ శుభలేఖలో శుభలేఖను ఎవరికైతే ఇస్తున్నారో.. వారి పేరును పెళ్లికొడుకు , పెళ్లి కుమార్తెల పేర్లకు పైన రాసి ఇవ్వడం కూడా గమనించవచ్చు. మరి అప్పటి శుభలేఖ.. దాదాపు 91 సంవత్సరాల క్రితపు శుభలేఖ ల‌ను చూస్తుంటే మన పాత రోజులు ఎన్నో గుర్తొస్తున్నాయి .. ఆ రోజుల్లోనే రేలంగి పెళ్లి పత్రిక తెలుగు సాంప్రదాయాన్ని ప్రతిభంబ ఇచ్చే విధంగా ముద్రించారు..

మరింత సమాచారం తెలుసుకోండి: