మనకు తెలిసిందే పుష్ప2 సినిమాతో ఇండస్ట్రీ రికార్డును బ్రేక్ చేసిన అల్లు అర్జున్ కొద్దిసేపటి క్రితమే అరెస్టు అయ్యారు . తెలంగాణ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. దానికి కారణం కూడా మనకు తెలిసిందే. పుష్ప2 సినిమా రిలీజ్ అయిన రోజు సంధ్యా థియేటర్ కు వచ్చాడు అల్లు అర్జున్. అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎటువంటి భద్రతా లేకుండా నే అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కి రావడంతో అక్కడ జనాలు ఆయనను చూడడానికి ఏకబడడంతో రేవతి అనే మహిళ మృతి చెందింది . దీనిపై కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అదే విధంగా టెలివిజన్ రంగంలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. 
అయితే పలు సెక్షన్ల కింద అల్లు అర్జున్ పై కేసు నమోదయింది. దీన్ని చాలా లైట్ గా తీసుకున్న బన్నీ అసలు ఈ విషయాన్ని మర్చిపోయాడు . ఒకానొక ఈవెంట్లో రేవతి ఫ్యామిలీని ఆదుకుంటామంటూ చెప్పుకొచ్చాడు . 25 లక్షలు కూడా ఇస్తామంటూ మాట ఇచ్చారు.  అయితే కొద్ది సేపటి క్రితమే తెలంగాణ పోలీసులు బన్నీ ని ఆయన స్వగృహంలో అదుపులోకి తీసుకున్నారు . దీనికి సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి.  పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడంతో ఫ్యాన్స్ ఫుల్ టెన్షన్ పడిపోతున్నారు . అయితే పోలీసులు ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు .

అంతేకాదు కేటీఆర్ ఇప్పటికే ట్విట్టర్ వేదికగా స్పందించాడు . జరిగిన దానికి అల్లు అర్జున్ నేరుగా బాధ్యుడు కాదుగా ..ఒక నేషనల్ అవార్డు విన్నర్ ని ఎలా అరెస్ట్ చేస్తారు..? అంటూ ట్విట్టర్ వేదికగా స్పందించారు . అయితే చాలామంది మాత్రం బన్నీపై ట్రోలింగ్ చేస్తున్నారు.  ఒకానొక ఈవెంట్లో తెలంగాణ సీఎం పేరు చెప్పేముందు మాట తడిబడి నీళ్లు తాగుతూ గ్యాప్ తీసుకున్నాడు. అయితే అది అల్లు అర్జున్ కావాలనే చేశాడు అంటూ చాలా ట్రోలింగ్ జరిగింది. ఇప్పుడు తెలుస్తుంది తెలంగాణ సీఎం అంటే ఎవరో అంటూ ఘాటుగా ట్రోల్ చేస్తున్నారు.  అయితే గత కొన్ని రోజులుగా మెగా వర్సెస్ అల్లు వార్ సోషల్ మీడియాలో ఎలా హీట్ పెంచేస్తుందో తెలిసిందే . ఇదే మూమెంట్లో బన్నీ అరెస్టు కావడం సినిమా ఇండస్ట్రీని కుదిపేస్తుంది . అసలు సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది..? ఏం జరగబోతుంది..? అనే విషయంపై అందరూ టెన్షన్ టెన్షన్ గా ఆలోచిస్తున్నారు..!



 

మరింత సమాచారం తెలుసుకోండి: