తెలుగు చిత్ర పరిశ్రమ లో సంక్రాంతి అంటే చాలు రచ్చ మామూలు గా ఉండదు .. మా సినిమా కి థియేటర్లు రాలేదని ఒకరు ... అంటే మా సినిమాకి థియేటర్లు ఇవ్వలేదని మరొకరు యాగి చేస్తూ ఉంటారు .. గత మూడు సంక్రాంతిల కి ఇది హ‌వా నడుస్తూ వస్తుంది .. అయితే సంక్రాంతి సమయం లో ఎక్కువ వినిపించే పేరు దిల్ రాజు ది .. ముందు ఆయన తాను నిర్మించిన .. తాను డిస్ట్రిబ్యూట్ చేసే సినిమాల కు మిగిలిన సినిమాలకు థియేటర్లు ఇవ్వరని అంటారు . తర్వాత రాజే  అన్ని సినిమాల కు థియేటర్లు ఇస్తూ వస్తుంటాడు .


గత రెండు సంవత్సరాలు గా దిల్ రాజు కు పోటీ గా మైత్రి వాళ్లు డిస్ట్రిబ్యూషన్లో దిగటం తో సంక్రాంతి ఫైట్ మరింత కసిగా మారింది .. ఈసారి కూడా సంక్రాంతి కి థియేటర్స్ ఫైట్ తప్పేలా కనిపించడం లేదు .. వచ్చే సంక్రాంతి కి దిల్ రాజు సొంత బ్యానర్లు వస్తున్న గేమ్ చేంజర్ తో పాటు సంక్రాంతి కి వస్తున్నాం .. ఈ రెండు సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి .. అలాగే బాలయ్య డాకు మహారాజ్ సినిమా ని కూడా దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు .

 

ఇలా దిల్ రాజు సినిమాలే సంక్రాంతికి మూడు ఉన్నాయి .. మైత్రి వాళ్ల పుష్ప 2 ఇప్పుడు థియేటర్లో మంచి ఊపులో ఉంది .. నితిన్ రాబిన్‌హుడ్ సినిమాను క్రిస్మస్ రేసు నుంచి తెప్పించి సంక్రాంతి బరిలోకి జనవరి 13న రిలీజ్ చేయాలని మైత్రి వాళ్లు చూస్తున్నారు .. దీన్నిబట్టి మళ్లీ థియేటర్లో గొడవ తప్పదు అనిపిస్తుంది . మైత్రి వాళ్ళు తమ రాబిన్‌హుడ్ సినిమా కోసం అప్పుడే థియేటర్లు కూడా బ్లాక్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి .. ఇప్పుడు ఏదేమైనా సంక్రాంతి కి ఈసారి దియేటర్ల వార్ తప్పేలా కనిపించడం లేదు .

మరింత సమాచారం తెలుసుకోండి: