ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా సంచలనం అవుతోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ చిక్కడపల్లి పీఎస్ లో ఉన్నారు. అల్లు అర్జున్ పిటిషన్ పై విచారణ 4 గంటలకు వాయిదా పడింది. పోలీసుల నుంచి పూర్తి వివరాలను సేకరించి సాయంత్రం 4 గంటలకు చెబుతానని పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పుకొచ్చారు. పుష్ప2 రిలీజ్ సమయంలో సంధ్య థియేటర్ లో చోటు చేసుకున్న ఘటన విషయంలో పోలీసులు బన్నీని అరెస్ట్ చేశారు.
 
బన్నీ అరెస్ట్ గురించి తెలిసిన వెంటనే చిరంజీవి చిక్కడపల్లి పీఎస్ కు చేరుకోనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం విశ్వంభర షూట్ లో బిజీగా ఉన్న చిరంజీవి షూట్ ను రద్దు చేసుకున్నారని తెలుస్తోంది. పోలీస్ స్టేషన్ లో బన్నీతో చిరంజీవి మాట్లాడనున్నారని సమాచారం అందుతోంది. ఈ కేసులో అల్లు అర్జున్ కు రిమాండ్ విధించే ఛాన్స్ ఉందని భోగట్టా. చేయని తప్పుకు బన్నీ శిక్ష అనుభవిస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
 
కోర్టు రిమాండ్ విధిస్తే బన్నీని చంచల్ గూడ జైలుకు తరలించనున్నారని సమాచారం అందుతోంది. చిరంజీవి దంపతులు ఇప్పటికే బన్నీ నివాసానికి వచ్చి పూర్తి వివరాలను తెలుసుకున్నట్టు సమాచారం అందుతోంది. అల్లు అర్జున్ పై నమోదైన కేసులు సైతం పెద్ద కేసులే అని ఆ సెక్షన్ల ప్రకారం శిక్ష భారీగా ఉండనుందని తెలుస్తోంది. కొన్ని పార్టీలకు వ్యతిరేకంగా పని చేయడం వల్లే బన్నీని టార్గెట్ చేశారని భోగట్టా. దిల్ రాజు మరి కొందరు సినీ ప్రముఖులు సైతం స్టేషన్ దగ్గరకు వెళ్తున్నారని సమాచారం.
 
ప్రస్తుతం పోలీసులు బన్నీ రిమాండ్ కు అంతా సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. అరెస్ట్ సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై అల్లు అర్జున్ తీవ్ర అసహనం వ్యక్తం చేయడం గమనార్హం. . బట్టలు మార్చుకునేందుకు కూడా అవకాశం ఇవ్వరా అంటూ బన్నీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బన్నీ అరెస్ట్ విషయంలో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకుంటాయో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: