నేచురల్ స్టార్ నాని గురించి జనాలకి చెప్పాల్సిన పని లేదు. ఓ సెపరేట్ ఫ్యాన్ బేస్ కాకుండా హీరో నానీ అంటే దాదాపు అందరూ ఇష్టపడుతూ ఉంటారు. అందుకే ఆయన సినిమాలు మినిమమ్ గ్యారంటీ అవుతాయి. ఇక స్టోరీల విషయంలో నానీది అందె వేసిన చేయిగా చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆయన సినిమాలు దాదాపుగా ఒకదానికొకటి చాలా డిఫరెంటుగా ఉంటాయి. ఇక హీరో నాని తన కో స్టార్లతో చాలా స్నేహంగా ఉంటాడు. సినిమా అయిపోయిన వెంటనే దులుపుకొని పోయే మనస్తత్వం కాదు అతనిది. మంచి రిలేషన్స్ మెంటైన్ చేసేవాడిలా నానికి మంచి పేరు ఉంది. ఈ క్రమంలో నానిహీరోయిన్ విషయంలో చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆమె మరెవరో కాదు. మహానటి కీర్తి సురేష్. అవును, ఆమె తాజాగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసినదే. పది హేనేళ్లుగా రహస్యంగా తన రహస్య స్నేహితుడు ఆంటోనితో ప్రేమ నేర్పిన కీర్తి సురేష్ తాజాగా వివాహ జీవితంలోకి అడుగుపెట్టింది. గత నెలలోనే తన ప్రేమ వ్యవహారాన్ని కీర్తి సురేష్ సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ, తిరుమల వెంకన్నని కూడా దర్శించుకుని ఆశీస్సులు తీసుకుంది. ప్రస్తుతం ఇక కీర్తి సురేష్, ఆంటోని వివాహా వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే హీరో నాని కీర్తి సురేష్ ని ఉద్దేశించిన పోస్ట్ వైరల్ అవుతోంది. నాని, కీర్తి సురేష్ కలిసి.. నేను లోకల్, దసరా సినిమాలలో నటించిన సంగతి విదితమే. కాగా నాని ఆమెని ఉద్దేశిస్తూ.. ఆమె వైవాహిక జీవితం మూడు పూవులు, ఆరు కాయలుగా వర్ధిల్లాలని కోరుకుంటున్నానని.. ఆ దంపతుల మధ్య గడిచిన మ్యాజియల్ క్షణాలను తాను కూడా ఆస్వాదించినట్టు రాసుకొచ్చాడు. ఆ తరువాత ఆ పోస్టుకి ఒక లవ్ ఎమోజి జోడిస్తూ కొత్త జీవితానికి ఆహ్వానిస్తున్నట్టు ఆల్ ది బెస్ట్ అని చెబుతూ ఓ పోస్ట్ చేసాడు. దానిని చూసిన మన మహానటి కీర్తి సురేష్ మరో లైవ్ సింబల్ జోడిస్తూ థాంక్స్ అని చెప్పుకొచ్చింది. కాగా కీర్తి సురేష్ ప్రస్తుతం "బేబీ జాన్" మూవీతో ఆడియెన్స్ పలకరించేందుకు రెడీగా ఉంది. పెళ్లి పనుల కారణంగా ఆమె ఎక్కువగా ప్రమోషన్స్‌లో కనిపించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: