ఇక అల్లు అర్జున్ తరఫున న్యాయవాది నిరంజన్ రెడ్డి కూడా హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేయగా ఇంకా వీటి మీద న్యాయస్థాన స్పందిస్తూ ఈఫిటిషన్ ని సోమవారానికి విచారిస్తామంటూ తెలిపారట. దీంతో ఇప్పుడు అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయిన దృశ్యాలను చూపిస్తూ లంచ్ మిషన్ పిటిషన్ గా స్వీకరించాలంటూ లాయర్ కోర్టుని సైతం కోరాడట.. అయితే మధ్యాహ్నం 1:30 గంటలకు లంచ్ మోషన్ పిటిషన్ ని సైతం కోరడం సరైన చర్య కాదు అంటూ ప్రభుత్వం తరఫున లాయర్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారట. అయితే లాయర్ నిరంజన్ రెడ్డి మాత్రం ఈ కేసులో పోలీసులు ఎటువంటి చర్యలు సోమవారం వరకు తీసుకోకూడదని ఆదేశాలను కోరడం జరిగిందట. అందుకు సంబంధించి పూర్తి సమాచారం వచ్చిన తర్వాత కోర్టు తెలియజేస్తామంటూ తెలిపిందట.
అయితే అల్లు అర్జున్ అరెస్టు కావడంతో పోలీస్ స్టేషన్ దగ్గరికి అతని తండ్రి అల్లు అరవింద్ తో పాటు మామ చంద్రశేఖర్ రెడ్డి ,ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇలా చాలామంది సినీ ప్రముఖులు కూడా తరలివచ్చారు. అయితే ఈ కేసులు బన్నీని స్టేషన్ బెయిల్ ఇస్తారా లేదా అనే విషయం సందిగ్గంగా మారింది. అయితే తాజాగా స్టేషన్ దగ్గరికి చిరంజీవి రాబోతున్నట్లు సమాచారం. అయితే పోలీసులు మాత్రం చిరంజీవిని రావద్దు అని కోరుతున్నారట. అభిమానులు కూడా వస్తే తమ పైన చాలా ఒత్తిడి పెరుగుతుందని తెలియజేసినట్లు సమాచారం మరి చిరంజీవి ఎలా స్పందిస్తారో చూడాలి.