టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గురించి తెలుగువారికి బాగా తెలుసు. అనేక పాటలకు ఉత్తమ కొరియోగ్రఫీ అందించిన జానీ మాస్టర్ని నేషనల్ అవార్డు కూడా వరించి దూరమైన సంగతి విదితమే. ఇక దానికి కారణం కూడా అందరికీ తెలిసిందే. ఓ సహ లేడీ కొరియో గ్రాఫర్ని లైంగికంగా వేధించిన నేపథ్యంలో జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యి, ప్రస్తుతం బెయిల్ మీద బయటకు వచ్చి సాధారణ జీవితాన్ని జీవిస్తున్నాడు. కాగా నిన్నటికి నిన్న జానీ తన మీద వచ్చిన రూమర్లను కూడా కొట్టి పారేస్తూ... తనకు తెలియకుండా అధ్యక్ష ఎన్నికలు జరిగితే, కోర్టులోనే సవాల్ చేస్తానని కూడా చెప్పుకొచ్చాడు. అసోసియేషన్‌లో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నించినందుకే ఇలా తన మీద ప్రతీకార చర్యలు తీర్చుకుంటున్నారని కూడా ఈ సందర్భంగా వాపోయాడు జానీ.

ఇక అసలు విషయంలోకి వెళితే... జానీ మాస్టర్ ప్రస్తుతం తన డ్యాన్స్ ప్రాక్టీస్ కోసం రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో జానీ తాజాగా ఓ రీల్ వీడియోని షేర్ చేయగా ప్రస్తుతం అది మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతోంది. పవర్ స్టార్ పాట వెనకాల వినిపిస్తుంటే జానీ మాస్టర్ అలా తన డ్యాన్స్ ప్రాక్టీస్ కోసం స్టూడియోకి వెళ్తున్న విజువల్స్ పెట్టడంతో సదరు వీడియో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా త్వరలోనే బిగ్ అప్డేట్ ఇస్తానని జానీ మాస్టర్ తెలిపాడు. అంటే ఓ పెద్ద సినిమాకు మళ్లీ ఆఫర్ వచ్చినట్టుగా చాలా స్పష్టంగా అర్ధం అవుతోంది. ఇక పోక్సో కేసు తరువాత జానీ మాస్టర్ గ్రాఫ్, ఇమేజ్ డౌన్ అయిపోయిందని అంతా అనుకుంటున్న తరుణంలో ఇలా జానీ జోష్ తో కనబడడం కొంతమంది అభిమానులను ఖుషీ చేసింది.

అవును, జానీ త్వరగానే బయటకు వచ్చేలా ఈ వీడియోలో కనబడ్డాడు. మళ్లీ తన పనిలో తాను బిజీ అవ్వడం ఖాయమని జనాలకి చెప్పకనే చెప్పేసాడు. బ్యాక్ టు బీట్స్ అంటూ జానీ మాస్టర్ వదిలిన రీల్ వీడియో అయితే వైరల్ అవుతోంది. రామ్ చరణ్ గేమ్ చేంజర్ నుంచి రాబోతోన్న డోప్ సాంగ్‌కు జానీ మాస్టరే కొరియోగ్రఫీ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ పాటతో తన పేరు బాగానే మార్మోగిపోతుందని కూడా జానీ మాస్టర్ చాలా నమ్మకంతో ఉన్నాడు. ఇక జానీకి మన టాలీవుడ్ నుంచి ఏ పెద్ద హీరోలు ఆఫర్లు ఇస్తారో వేచి చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: