పుష్ప స్టార్ అల్లు అర్జున్ ను ఈరోజు హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోగా, ఆమె భర్త కేసు వేశారు. ఈ FIRలో నిందితుడిగా అల్లు అర్జున్ పేరు కూడా చేర్చారు. ఈ కేసులో భాగంగా శుక్రవారం నాడు పోలీసులు అల్లు అర్జున్ ను ఇంటికి వెళ్లి మరీ అరెస్టు చేశారు. కనీసం డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా బన్నీకి సమయం ఇవ్వకుండా అతనో పెద్ద నేరస్తుడిలాగా ట్రీట్ చేస్తూ ఆగ మేఘాలపై తరలించారు. బన్నీగా పోలీసులు తీసుకెళుతున్న దృశ్యాలు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి చూసి చాలామంది షాక్ తిన్నారు.

ఒక సాధారణ క్రిమినల్లాగా అతనిని పోలీసులు హ్యాండిల్ చేశారని కేటీఆర్ లాంటి పెద్ద నేతలు కూడా పోలీసుల తీరును ఖండించారు. ప్రతి దానికి ఒక పద్ధతి ఉంటుందని, హై పర్సనాలిటీస్ ని చాలా జాగ్రత్తగా డీల్ చెయ్యాలని అన్నారు. రేవతి మరణం దురదృష్టకరం అని, బాధిత కుటుంబ సభ్యుల పట్ల తాను ఎంతో సానుభూతి చూపిస్తున్నానని కానీ అల్లు అర్జున్ ఈ ఘటనకు కారణం కాదని కేటీఆర్ స్పష్టం చేశారు. క్రౌడ్‌ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీసులదే అని, అందులో వాళ్ళు ఫెయిల్ అయి అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం అన్యాయం అని చాలామంది కూడా కామెంట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి సర్కారు ఒక పిచ్చి సర్కార్ అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. కొంతమంది పోలీస్ స్టేషన్ ముందుకు వెళ్లి నిరసనలు కూడా చేస్తున్నారు.

 సరిగ్గా ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ అరెస్ట్ పై పెదవి విప్పారు. చట్టం అందర్నీ సమానంగా చూస్తుందని, అల్లు అర్జున్ అయినా ఇంకెవరైనా చట్టం ముందు అందరూ సమానులేనని కామెంట్లు చేశారు. బన్నీ అరెస్టు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. రేవంత్ రెడ్డి ఇంకా మాట్లాడుతూ అల్లు అర్జున్ అరెస్ట్ లో నేను జోక్యం చేసుకోనని స్పష్టం చేశారు. చట్టపరమైన ప్రక్రియ ఎలా జరగాలో అలానే జరగనిస్తానని కూడా రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

 ఇదిలా ఉండగా బన్నీ అరెస్టుతో చిరంజీవి షాక్ అయ్యారు. అంతేకాదు ఆయన తన షూటింగ్ రద్దు చేసుకొని మరీ అల్లు అర్జున్ నివాసానికి వెళ్లారు. చిరంజీవి భార్య సురేఖ కూడా అల్లు అరవింద్ ని కలవడం జరిగింది. ఈ కష్టకాలంలో చిరంజీవి దంపతులు అల్లు అరవింద్ కి, స్నేహ రెడ్డికి ధైర్యం చెబుతున్నారు. ఈ కేసులో బన్నీ దోషగా తేలితే పదేళ్లదాకా శిక్ష పడొచ్చు అంటూ వస్తున్న వార్తలు కలవరం కలిగిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: