అయితే ఈ కేసులో అల్లు అర్జున్ అరెస్టు చేసిన పోలీసులు తదుపరి విచారణ కోసం సిద్ధం చేస్తున్నారట ఇందులో భాగంగా రిమాండ్ రిపోర్టింగ్ సిద్ధం చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు అల్లు అర్జున్ ని ఇటీవలి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి గాంధీ ఆసుపత్రికి సైతం తరలించారు.. అక్కడ అల్లు అర్జున్ కి వైద్య పరీక్షలు నిర్వహించి ఈ వైద్య పరీక్షలు ముగిసిన తర్వాత నాంపల్లి కోర్టులో హాజరు పరచబోతున్నారట.. కోర్టు తీర్పు మేరకే అల్లు అర్జున్ సైతం రిమాండ్ కి తరలించబోతున్నట్లు సమాచారం.
అరెస్టు సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపైన అల్లు అర్జున్ కూడా కాస్త హసనాన్ని తెలియజేసినట్లు వీడియోలు వైరల్ గా మారుతున్నాయి.
ఉన్నఫలంగా మీతో రావాలి అంటే ఎలా అని పోలీసులను సైతం ప్రశ్నించారట?.. బట్టలు మార్చుకునేందుకు కూడా తనకు అవకాశం ఇవ్వరా! అంటూ ఫైర్ అయ్యారు.. పోలీసులు తనని తీసుకువెళ్లడంతో ఎలాంటి అభ్యంతరం లేదని అల్లు అర్జున్ కూడా తెలిపారు.. కానీ బెడ్ రూమ్ వరకు వెళ్లి మరి డ్రెస్ మార్పించి అల్లు అర్జున్ ని తీసుకువెళ్లడంతో కాస్త సహనాన్ని తెలిపారు.. దీంతో మెగా కుటుంబ సభ్యులు చిరంజీవి, నాగబాబు లాంటివారు అల్లు అరవింద్ ఇంటికి వెళ్లడం జరిగింది. మరి ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.