"ప్రతి మగాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది" అని నానుడి. ఇది ఎంతమంది విషయంలో నిజమయ్యిందో తెలియదు కానీ, అల్లు అర్జున్ దీనిని బలపరుస్తున్నాడు. అవును, భార్య మాట విన్నవాడు బాగుపడతాడు.. భార్య ఏది చెప్పి భర్త మంచికే.. అంటూ వేదాలు వల్లిస్తున్నాడు. ఈ విషయంలో మెగాస్టార్ అయినా.. ఐకాన్ స్టార్ అయినా.. అందరూ ఒకటే. ఇంట్లో భార్య చెప్పిన మాట వినాల్సిందే అని అంటున్నాడు. ఇంతకీ ఏ సందర్భంలో ఈ విషయాలు చెప్పాడో తెలియాలంటే ఈ కధనం పూర్తిగా చదవాల్సిందే.

అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా పార్ట్ 2 దుమ్ము దులిపేస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఎన్నో అంచనాలు మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ప్రస్తుతం బాక్షాఫీస్ ని షేక్ చేస్తోంది. కేవలం వారం రోజుల్లోనే వెయ్యికోట్లు మార్క్ దాటేసిన సినిమాగా పుష్ప రికార్డుల్లోకి ఎక్కింది. ఈ సందర్భంగా ఓ వేదికగా మాట్లాడిన పుష్పరాజ్ అలియాస్ అల్లు అర్జున్ భార్య గురించి చాలా గొప్పగా చెప్పుకు రావడం గమనార్హం. అయితే వివిధ వేదికల మీద అల్లు అర్జున్ తన భార్య స్నేహ గురించి అడపాదడపా చెప్పుకు రావడం అందరికీ తెలిసిన విషయమే. వారిద్దరిదీ లవ్ మేరేజ్ అన్న సంగతి కూడా తెలిసినదే.

ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ... ఈరోజు తన వలనే ఇలా మారాను అని, దానికి అంతా స్నేహనే అని చెప్పుకొచ్చాడు. వాస్తవానికి పుష్ప 2 సినిమా మొత్తం భార్య గురించే ఉంటుంది. భార్య మాట వింటే ఎలా ఉంటుందో ఈ సినిమాలో సుకుమార్ చక్కగా చూపించాడు. తాజాగా పుష్ప 2 సక్సెస్ మీట్ లో కూడా అదే చెప్పుకొచ్చాడు. ప్రపంచంలో ఉన్న 38 కోట్ల భర్తలకు మీరు ఇచ్చే సలహా ఏంటి? అని యాంకర్ అల్లు అర్జున్ ని అడగగా... అందరూ భార్య మాటకు గౌరవం ఇవ్వాలి. భార్యలకు భయపడాలి. భార్య ముందు ఎంత తగ్గినా తప్పులేదు! అంటూ చెప్పుకొచ్చాడు. దాంతో భార్య ముందు తగ్గాడు కాబట్టే అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ అయ్యాడు అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. అల్లు అర్జున్ అయినా, చివరికి పుష్ప రాజ్ అయినా భార్యకు విలువ ఇవ్వాల్సిందేనని అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: