తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోలలో అల్లు అర్జున్ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇకపోతే కొంత కాలం క్రితం అల్లు అర్జున్ , సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప పార్ట్ 1 అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్ కి ఇండియా వ్యాప్తంగా గుర్తింపు లభించింది. దానితో ఈ సినిమాకు కొనసాగింపుగా పుష్ప పార్ట్ 2 అనే సినిమాను రూపొందించారు.

ఈ సినిమాను డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేశారు. ఈ మూవీ ని డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేయగా ఈ మూవీ కి సంబంధించిన ప్రీమియర్ షో లను డిసెంబర్ 4 వ తేదీ రాత్రి నుండి కొన్ని ప్రాంతాలలో ప్రదర్శించారు. ఇకపోతే ఈ సినిమాను హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్లలో కూడా ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలో భాగంగా అల్లు అర్జున్ కూడా ఈ థియేటర్ కి విచ్చేశాడు. ఇక అల్లు అర్జున్ రావడంతో ఇక్కడ భారీ తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందింది. ఇక మహిళ మృతి చెందడంతో అల్లు అర్జున్ ను తాజాగా పోలీసులు అరెస్టు చేశారు.

ఈ అరెస్టుపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా స్పందించాడు. రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ అరెస్టుపై తాజాగా స్పందిస్తూ ... చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని అన్నారు. ఈ అరెస్టు విషయంలో తన జోక్యం ఏ మాత్రం లేదు అని ఆయన స్పష్టం చేశారు. తొక్కిసలాటలో ఒకరు చనిపోయిన నేపథ్యంలో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు అని ఢిల్లీలో జరిగిన చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి మీడియాకు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: