నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తన సినిమాలతో ఎంతోమంది అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. ముఖ్యంగా తన డైలాగ్స్ తో విపరీతంగా ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. నటసింహం నందమూరి బాలకృష్ణ కెరీర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలలో నటించాడు. అందులో ముఖ్యంగా నరసింహనాయుడు సినిమా ఒకటి. ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో చెప్పనవసరం లేదు. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అవడంతో పాటు బాలయ్య సత్తా ఏంటో ఇండస్ట్రీ మొత్తానికి తెలిసిపోయింది.


నరసింహనాయుడు సినిమా 2001 సంవత్సరంలో సంక్రాంతి బరిలోకి దిగింది. అదే సమయంలో చిరంజీవి నటించిన మృగరాజు, వెంకటేష్ నటించిన దేవి పుత్రుడు సినిమాలతో పోటీపడి బాలకృష్ణ సినిమా ఇండస్ట్రీ హిట్ అయింది. నరసింహనాయుడు సినిమా 105 కేంద్రాలలో 100 రోజులు ఆడిన ఏకైక తొలి సినిమాగా రికార్డులలో నిలిచింది. కాగా, అదే సంవత్సరంలో ఈ సినిమాకు పోటీగా విడుదలైన ఖుషి సినిమా మంచి హిట్ అందుకుంది. ఇందులో పవన్ కళ్యాణ్, భూమిక జంటగా నటించారు.


ఖుషి సినిమాకు ముందే పవన్ కళ్యాణ్ ఆరు హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం ఖుషి సినిమా రిలీజ్ అయి మంచి సూపర్ హిట్ అయింది. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ ను టర్న్ చేసిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే 2001 సంవత్సరంలో రిలీజ్ అయిన ఖుషి, నరసింహనాయుడు సినిమాలు మంచి రికార్డులను సాధించాయి. ఈ రెండు సినిమాలలో బాక్సాఫీస్ ని షేక్ చేసిన సినిమా ఏది అనే సందేహం చాలా మందిలో ఉంది.


ఈ రెండు సినిమాల కలెక్షన్ల విషయానికొస్తే.... నరసింహనాయుడు సినిమా 22 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టింది. పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి సినిమా 21 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసింది. గుంటూరు, నెల్లూరు, ఉత్తరాంధ్ర, ఈస్ట్ వెస్ట్ కర్ణాటక వంటి ప్రాంతాలలో ఖుషి సినిమా కన్నా నరసింహనాయుడు సినిమాకి ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి. నరసింహనాయుడు సినిమా సంక్రాంతికి రిలీజ్ కాగా, మూడు నెలల తర్వాత ఖుషి సినిమా రిలీజ్ అయింది. నరసింహనాయుడు సినిమా 105 కేంద్రాలలో 100 రోజులు ఆడగా, ఖుషి సినిమా 79 కేంద్రాలలో 100 రోజులు ఆడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: