![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/allu-arjun-arrest-release-bail7d77ff4a-fe47-41b9-ab2d-b6c425b4fb05-415x250.jpg)
అంతేకాకుండా అల్లు అర్జున్ ఖైదీ నెంబర్ 7697 అన్నట్టుగా సమాచారం.. అయితే మొత్తానికి ఈరోజు కొన్ని నిమిషాల క్రితం అల్లు అర్జున్ ని చంచల్ గూడ జైలు నుంచి విడుదల చేసినట్లుగా తెలుస్తోంది.హైకోర్టు మధ్యంతర బెయిల్ సంబంధించిన ఉత్తర్వులను జైలు అధికారులు పరిశీలించి మరి ఆయనను వెనుక గేటు నుంచి పంపించినట్లు తెలుస్తోంది. సంధ్య థియేటర్ వద్ద జరిగా తొక్కిసలాటలో మహిళ మరణించడంతో బన్నీని చిక్కడపల్లి పోలీసులు సైతం అరెస్టు చేశారు. అయితే అనంతరం నాంపల్లి కోర్టులో 14 రోజులు రిమాండ్ విధించినప్పటికీ అల్లు అర్జున్ లాయర్ హైకోర్టుని సైతం ఆశ్రయించగా మభ్యంతర భైలు లభించిందట.
ఏది ఏమైనాప్పటికీ అల్లు అర్జున్ పై ఇలా చేయడంతో అభిమానులు సైతం ఒక్కసారిగా ఫైర్ అవుతూ ఉన్నారు. నిన్నటి రోజున రాత్రి అంతా కూడా అల్లు అర్జున్ జైలు నుంచి ఇంటికి వస్తారని తెలిసి అభిమానులు అల్లు అర్జున్ ఇంటి వద్ద పెద్ద సంఖ్యలో గుమ్మి కూడినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే చాలామంది రాజకీయ నాయకులు సినీ సెలబ్రిటీలు కూడా అల్లు అర్జున్ అరెస్ట్ అక్రమం అంటూ కూడా స్పందించడం జరిగింది. మరి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అల్లు అర్జున్ ఏ విధంగా స్పందిస్తారా చూడాలి మరి.