ఇటీవల హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ట్ రోడ్స్ సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతిచెందింది. ఆమె తొమ్మిది సంవత్సరాల కుమారుడు సాయితేజ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.ఇదంతా పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ థియేటర్ వైపు వెళ్లడంతో జరిగిందని ఆ మృతురాలుకు సంబందించిన వారు కేసు పెట్టడంతో అల్లు అర్జున్‌ను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి నుంచి చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలింపు,గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు,నాంపల్లి హైకోర్టులో వాదనలు,రిమాండ్‌ విధింపు, చంచల్‌గూడ జైలుకు తరలింపు అంతా నాటకీయ పరిణామాల మధ్య జరిగిపోయాయి. అదే సమయంలో హైకోర్టులో క్వాష్‌ పిటిషన్, బెయిల్‌ పిటిషన్లపై వాదనలు, సాయంత్రమే హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసినా రాత్రి వరకు కాపీ అందకపోవడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

అల్లు అర్జున్‌ న్యాయవాదులు సర్టిఫైడ్‌ కాపీలను తీసుకువచ్చి జైలు అధికారులకు ఇచ్చినా.. ఒరిజినల్‌ పత్రాలు కావాలంటూ జైలు అధికారులు అంగీకరించలేదు. రాత్రి 10 గంటల వరకు అల్లు అర్జున్‌ను జైలు రిసెప్షన్‌లోనే ఉంచిన సిబ్బంది ఆపై మంజీరా బ్యారక్‌లోని క్లాస్‌-1 రూమ్‌కు తరలించారు. అండర్ ట్రైన్ ఖైదీగా ఆయనకు నంబర్‌ 7697ను కూడా కేటాయించారు.అల్లు అర్జున్‌ తండ్రి అల్లు అరవింద్‌ రాత్రి 10.30 గంటల వరకు చంచల్‌గూడ జైలు వద్దే ఉన్నారు. బెయిల్‌ కాపీ అందితే తన కుమారుడిని వెంట తీసుకువెళ్లాలని భావించారు.కానీ అరవింద్ అనుకున్నట్లుగా అక్కడ ఏం జరగలేదు. అయితే అల్లుఅర్జున్ ను ఉంచిన బ్యారక్లోనే మరో విచారణ జరుగుతున్న మరో ఇద్దరు ఉండటం గమనార్హం.అయితే ఈరోజు ఉదయం అల్లు అర్జున్ జైలు నుండి విడుదల అవ్వడం ఖాయమని తెలుస్తుంది.

అయితే రాత్రంతా జైల్లోనే ఉన్న బన్నీకి ఎదురైన అనుభవాలు ఇలా వున్నాయి. బన్నీ ని మంజీర బ్యారక్ కు తరలించిన తరువాత జైలు అధికారులు ఫుడ్ ఆఫర్ చేసిన బన్నీ తీసుకోలేదని సమాచారం. ఆయనకు కొత్త రగ్గు బెడ్ షీట్ ఇవ్వగా సాధారణ ఖైదీ లాగే నేల మీద పడుకున్నట్టు సమాచారం. 14 రోజుల రిమాండ్ విధించినప్పుడు ఆయనకు న్యాయాధికారులు ప్రత్యేక ఖైదీగా పరిగణించాలని ఆదేశించారు. అయితే ఆ సౌకర్యాలు జైల్లోకి వచ్చిన మరునాడు నుంచి అందుతాయని జైలు అధికారులు తెలిపారు.




మరింత సమాచారం తెలుసుకోండి: