నేను ఎలాంటి ఆస్తుల గురించి ఆశ పడలేదని చెప్పాడు. నా భార్య, నేను చాలా కష్టపడి డబ్బులు సంపాదించుకుంటున్నామని మేము ఎవరిమీద ఆధారపడి బతకడం లేదని మంచు మనోజ్ అన్నారు. నా కుటుంబం కోసం ఎలాంటి డబ్బులు తీసుకోకుండా పనిచేశానని చెప్పాడు. అంతేకానీ ఎలాంటి ఆస్తుల గురించి ఆశ పడలేదని మనోజ్ వెల్లడించాడు. ఈ గొడవల్లో భాగంగా మోహన్ బాబు జర్నలిస్టుల మీద దాడి చేయడం జరిగింది. అనంతరం జర్నలిస్టులకు క్షమాపణలు కూడా చెప్పాడు. మా గొడవలు ఈరోజు కాకపోతే రేపు కూర్చొని మాట్లాడుకుంటే పోతాయి. మా కుటుంబంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దు అంటూ మోహన్ బాబు చెప్పాడు.
అయితే ఈ గొడవలకు గల ప్రధాన కారణం తాజాగా వెలుగులోకి వచ్చింది. మోహన్ బాబు, మంచు మనోజ్ గొడవ పడుతున్న ఆస్తులు దివంగత స్టార్ హీరోయిన్ సౌందర్యవని సమాచారం అందుతోంది. జల్ పల్లిలో మోహన్ బాబు ప్రస్తుతం ఉంటున్న ఇల్లు గతంలో సౌందర్యదట. హీరోయిన్ గా సినిమాలలో నటిస్తున్న సమయంలో సౌందర్య భారీగా డబ్బులను సంపాదించింది. ఆ డబ్బులతోనే మంచి స్థలాన్ని కొనుగోలు చేసి పెద్ద బంగ్లాను నిర్మించుకుంది. దీని విలువ ప్రస్తుతం రూ. 100 కోట్లకు పైనే ఉంటుందని సమాచారం అందుతుంది.
ఇక సౌందర్య మరణం తర్వాత ఆ ఇంటిని మంచు మోహన్ బాబు అతి తక్కువ ధరకే కొనుగోలు చేశారు. ప్రస్తుతం మోహన్ బాబు అదే ఇంట్లో నివాసం ఉంటున్నారు. అన్ని సౌకర్యాలతో మోహన్ బాబు మళ్లీ ఆ ఇంటిని సకల వసతులతో నిర్మించుకున్నారు. ప్రస్తుతం ఆ ఇల్లు విషయంలోనే మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య విభేదాలు, గొడవలు జరుగుతున్నాయట. ఆ ఇంటిని మంచు మనోజ్ తనకు ఇవ్వాలని గొడవలు చేయడం వల్లనే మోహన్ బాబు ఇలా చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. కాగా మీడియాపై దాడి చేసిన కేసులో మోహన్ బాబును అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందట. దీంతో ఆయన పరారీలో ఉన్నట్లు చెబుతున్నారు.