ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి అదృష్టం కలిసి వచ్చింది అనుకునే లోపల దురదృష్టం వెంటాడుతుంది.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా వైడ్ క్రేజ్ అందుకున్న అల్లుఅర్జున్ నేషనల్ అవార్డు సైతం అందుకున్నాడు.. ఇప్పటివరకు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఏ హీరోకి దక్కని గౌరవం అల్లుఅర్జున్ కి దక్కింది.. అయితే తన స్నేహితుడి కోసం పవన్ కల్యాణ్ కి మద్దతిచ్చి కూడా ఇటీవల ఎన్నికల్లో ప్రచారం చేయడం మెగా ఫ్యాన్స్ కి కోపం తెప్పించింది.. పుష్ప 2 సినిమాను బాయ్ కాట్ చేస్తామని మెగా ఫ్యాన్స్ భావించినా పుష్ప 2 సినిమా కూడా ఊహించని విజయం సాధించింది.. కేవలం 6 రోజుల్లోనే 1000 కోట్లు సాధించింది.. రిలీజ్  ముందు మెగా ఫ్యామిలీ అంతా మళ్ళీ కలిసిపోయింది.. బన్నీ సినిమాకు మెగా కుటుంబం సపోర్ట్ గా నిలిచింది.. అయితే రిలీజ్ కి ముందు జరిగిన సంధ్య థియేటర్ ఘటన అల్లు అర్జున్ ని వెంటాడుతుంది..తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందటం ఆమె కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉండటం అల్లుఅర్జున్ ని కలిచి వేసింది..
 
అంతే కాకుండా ఈ ఘటనకు భాద్యుడిగా ఆయనపై కేసులు కూడా నమోదు అయ్యాయి..ఊహించని విధంగా అల్లు అర్జున్ ని నిన్న చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి కోర్ట్ కి తరలించారు..నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా మేజిస్ట్రేట్ 14రోజుల రిమాండ్ విధించారు.దీంతో కేసును కొట్టేయాలంటూ అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ ను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం అల్లు అర్జున్‌కు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.అల్లు అర్జున్‌ న్యాయవాదులు సర్టిఫైడ్‌ కాపీలను తీసుకువచ్చి జైలు అధికారులకు ఇచ్చినా కూడా ఒరిజినల్‌ పత్రాలు కావాలంటూ జైలు అధికారులు అంగీకరించలేదు.

 రాత్రి 10 గంటల వరకు అల్లు అర్జున్‌ను జైలు రిసెప్షన్‌లోనే ఉంచిన సిబ్బంది ఆపై మంజీరా బ్యారక్‌లోని క్లాస్‌-1 రూమ్‌కు తరలించారు. అండర్ ట్రైన్ ఖైదీగా ఆయనకు నంబర్‌ 7697ను కూడా కేటాయించారు.అయితే రాత్రంతా జైల్లోనే వున్న బన్నీ ని మంజీర బ్యారక్ కు తరలించిన తరువాత జైలు అధికారులు ఫుడ్ ఆఫర్ చేసిన బన్నీ తీసుకోలేదని సమాచారం. ఆయనకు కొత్త రగ్గు బెడ్ షీట్ ఇవ్వగా సాధారణ ఖైదీ లాగే నేల మీద పడుకున్నట్టు తెలుస్తుంది... 14 రోజుల రిమాండ్ విధించినప్పుడు ఆయనకు న్యాయాధికారులు ప్రత్యేక ఖైదీగా పరిగణించాలని ఆదేశించారు. అయితే ఆ సౌకర్యాలు అన్నీ జైల్లోకి వచ్చిన మరునాడు నుంచి అందుతాయని జైలు అధికారులు తెలిపి నట్లు సమాచారం..

మరింత సమాచారం తెలుసుకోండి: