టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన గుర్తింపు కలిగిన నటులలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. ఈయన గంగోత్రి సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత కూడా ఈయన వరుస పెట్టి అనేక సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకోవడంతో చాలా తక్కువ కాలంలోనే అల్లు అర్జున్ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. ఇకపోతే కొంత కాలం క్రితం ఈయన పుష్ప పార్ట్ 1 అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ని తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయగా ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

సినిమా సూపర్ సక్సెస్ కావడంతో ఈ మూవీ కి కొనసాగింపుగా పుష్ప పార్ట్ 2 అనే మూవీ ని రూపొందించారు. ఈ మూవీ ని డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేశారు. ఇకపోతే కొంత కాలం క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ ఎన్నికల సమయంలో ఈయన వైసిపి పార్టీ అభ్యర్థికి సపోర్టుగా ఉన్నాడు. దానితో జనసేన కార్యకర్తలు , అభిమానులు మీ ఇంట్లో మనిషి అయినటువంటి పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకమైన వ్యక్తికి సపోర్ట్ చేస్తావా అంటూ ఆయనపై నెగిటివ్ గా స్పందించడం మొదలు పెట్టారు. దానితో అల్లు అర్జున్ కూడా ఎక్కడ తగ్గకుండా తనదైన రీతిలో దూసుకుపోయాడు. దానితో అప్పటి నుండి వైసిపి కార్యకర్తలు , నేతలు , అభిమానులు అల్లు అర్జున్ పై అభిమానాన్ని చూపించడం మొదలు పెట్టారు. ఇక పుష్ప పార్ట్ 2 సినిమా విషయంలో కూడా వైసీపీ కి సంబంధించిన ఎంతో మంది వ్యక్తులు బన్నీ కి సపోర్ట్ చేస్తూ వారు వచ్చారు.

ఇక పుష్ప పార్ట్ 2 ప్రీమియర్ షో కు సంధ్య థియేటర్ కు అల్లు అర్జున్ విచ్చేయడం , అక్కడ భారీగా జనాలు గుమ్మి కూడడంతో తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందడంతో నిన్న రాత్రి ఆయనను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయంలో కూడా వైసీపీకి చెందిన ఎంతో మంది నేతలు అల్లు అర్జున్ కు సపోర్టుగా నిలిచారు. దీనితో కొంత మంది అల్లు అర్జున్ తన ప్రమేయం లేకుండానే రాజకీయ చక్రంలో ఇరుక్కుపోతున్నాడా అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: