అల్లు అర్జున్ అరెస్టుతో ఇండస్ట్రీ మొత్తం ఏకమైంది.. నిన్న మొన్నటి వరకు అల్లు VS మెగా అంటూ కొట్టుకున్న అభిమానులు కూడా అల్లు అర్జున్ కి మద్దతుగా నిలిచారు. ఇండస్ట్రీ మొత్తం పుష్ప 2 సినిమా చూసి బన్నీకి మద్దతుగా పోస్టులు పెడుతూ ఉంటే మెగా ఫ్యామిలీ మాత్రం ఈ సినిమాకి సంబంధించి ఒక్క పోస్ట్ కూడా పెట్టకుండా నిశ్శబ్దం వహించారు. కానీ అల్లుడు అరెస్టు అయ్యాడు అని తెలియడంతోనే మెగాస్టార్ చిరంజీవి,నాగబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురు హుటాహుటిన అల్లు ఇంటికి చేరుకున్నారు.ముఖ్యంగా చిరంజీవి విశ్వంభర షూటింగ్లో చాలా బిజీగా ఉన్నారు. కానీ అల్లు అర్జున్ అరెస్టు విషయం తెలియడంతోనే షూటింగ్ పూర్తిగా ఆపేసుకొని తన భార్య సురేఖ ను తీసుకొని అల్లు అరవింద్ ఇంటికి వెళ్లారు.అక్కడికి వెళ్లి వారిని ఓదార్చి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్దామనుకుంటే పోలీసులు చిరంజీవిని రావద్దని,వస్తే అభిమానుల ఒత్తిడి తట్టుకోలేమని చెప్పడంతో చిరంజీవి మళ్ళీ సైలెంట్ గా ఇంటికి వెళ్లిపోయారు.

అలాగే నాగబాబు కూడా అల్లు అరవింద్ నివాసానికి వెళ్లారు. ఇక ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఢిల్లీ నుండి హైదరాబాద్ బాట పట్టారు.అలా అల్లు అర్జున్ అరెస్టుతో మెగా ఫ్యామిలీ మొత్తం ఏకమై అల్లు నివాసానికి బయలుదేరారు.ఇలా ఆనంద సమయంలో కాదు కష్ట సమయంలో తోడు ఉన్నవాళ్లే నిజమైన బంధువులు అనే దానికి మెగా అల్లు ఫ్యామిలీలు ప్రస్తుతం నిదర్శనంగా మారాయి. ఇక అల్లు అర్జున్ అరెస్టుతో సినీ ఇండస్ట్రీ మొత్తం ఏకమైంది.హీరో నాని, నితిన్, రష్మిక మందన్నా,దిల్ రాజు,త్రివిక్రమ్, అనిల్ రావిపూడి, రాఘవేంద్రరావు, దగ్గుబాటి రానా, గోపీచంద్ మలినేని,రాహుల్ రామకృష్ణ, శ్రీ విష్ణు వంటి ఎంతోమంది సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా మహిళ మృతి చనిపోవడం దారుణం అని చెబుతూనే అల్లు అర్జున్ కి సపోర్ట్ ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం పై మండిపడ్డారు.

 అంతేకాకుండా కాంగ్రెస్ కి విపక్షాలైనటువంటి బిజెపి, బిఆర్ఎస్ నేతలు అయినటువంటి కిషన్ రెడ్డి, కేటీఆర్, హరీష్ రావు,బండి సంజయ్ వంటి వాళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం పై మండిపడ్డారు.దీంతో అల్లు అర్జున్ బ్రాండ్ ఏంటో ఇండస్ట్రీకి తెలిసి వచ్చింది. ఇక అల్లు అర్జున్ ఫాలోయింగ్ చూసి బ్రాండ్ అంటే ఇది అంటూ ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే అల్లు అర్జున్ అరెస్టు మెగా అల్లు కుటుంబాలను కలిపినప్పటికీ ఇద్దరు పూర్తిగా కలిసి ఉంటారా..లేక మళ్ళీ దూరం పెరుగుతుందా అని అభిమానుల్లో ఏదో ఒక చిన్న అనుమానం అయితే ఉంది

మరింత సమాచారం తెలుసుకోండి: