ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అల్లు అర్జున్ కొంత కాలం క్రితం పుష్ప పార్ట్ 1 అనే సినిమాలో హీరోగా నటించాడు. రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... సుకుమార్ కి మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. ఇక ఈ సినిమాలోని నటనకు గాను అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఇకపోతే ఈ సినిమాకు కొనసాగింపుగా పుష్ప పార్ట్ 2 అనే సినిమాను రూపొందించారు. ఈ మూవీ ని ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేశారు.

ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో లను డిసెంబర్ 4 వ తేదీ రాత్రి నుండి ప్రదర్శించడం మొదలు పెట్టారు. ఇకపోతే ఈ సినిమాకు ప్రీమియర్ షో లతోనే అద్భుతమైన టాక్ రావడంతో ఈ మూవీ ఇప్పటికే 1000 కోట్లకి పైగా కలెక్షన్లను రాబట్టి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇది ఇలా ఉంటే అల్లు అర్జున్ కి ఈ సినిమాతో హిట్ తో పాటు కష్టాలు కూడా వచ్చాయి అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. ఎందుకు అంటే ఈ మూవీ కి సంబంధించిన ప్రీమియర్ షో లను డిసెంబర్ 4 వ తేదీన రాత్రి ప్రదర్శించిన సందర్భంగా హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్న సంధ్య థియేటర్లో ప్రీమియర్ షో ను ప్రదర్శించారు.

ఇక ఈ ప్రీమియర్ షో కు అల్లు అర్జున్ కూడా వచ్చాడు. దానితో ఇక్కడ భారీగా జనాలు గుమిగూడారు దానితో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో ఇక మహిళ మృతి చెందడంతో అల్లు అర్జున్ ను తెలంగాణ పోలీసులు నిన్న అరెస్టు చేశారు. ఇలా పుష్ప సినిమాతో అల్లు అర్జున్ కు అద్భుతమైన విజయంతో పాటు కొన్ని కష్టాలు కూడా వచ్చాయి అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: