మనకు తెలిసిందే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని నిన్న తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు.  ఆ తర్వాత మధ్యంతర బెయిల్ తో బయటకు వచ్చాడు . కానీ ఈ లోపు అల్లు అర్జున్ కి అల్లు అర్జున్ పేరుకి బాగా నెగిటివిటీ ఏర్పడిపోయింది . అల్లు అర్జున్ పేరుని చాలా రోజు ల నుంచి ట్రోల్ చేశారు జనాలు . అయితే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం అన్యాయం అంటూ రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు బడా బడా స్టార్స్ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు . కావాలని తెలంగాణ ప్రభుత్వం బన్నీపై కక్ష చర్యలు చేస్తున్న విధంగా కనిపిస్తుంది అంటూ ప్రతి ఒక్క రాజకీయ నేత స్పందించడం గమనార్హం . అయితే రేవంత్ రెడ్డి మాత్రం బన్నీని అరెస్ట్ చేయడం పై ప్రముఖులు మాట్లాడుతున్న విధానాన్ని తప్పుపట్టారు .


అన్యాయంగా ఒక ఆడ మనిషి చనిపోతే అది పట్టించుకోకుండా ..అరెస్ట్ చేయడం తప్పు తప్పు అంటారా..? అతగాడు ఏమన్నా ఇండియా పాకిస్తాన్ బోర్డర్లో యుద్ధాలు చేసి గెలిచాడా..? సినిమాను తీశాడు సినిమా ద్వారా డబ్బులు సంపాదించుకున్నాడు.. దానివల్ల దేశానికి ఏం లాభం..? అనే రేంజ్ లో మాట్లాడి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు మండించేలా చేశారు . అయితే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేస్తే ఆయన పరువు ప్రతిష్టలు సగం పోతాయి అని అంతా అనుకున్నారు . ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ పడిపోతాది అనుకున్నారు. కానీ అలా జరగలేదు.



అల్లు అర్జున్ ఫ్యాన్ బేస్ అదేవిధంగా గౌరవం ఇంకా డబల్ స్థాయిలో రెట్టింపు పెరిగింది అంటున్నారు జనాలు. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత ఎక్కడ సీరియస్ గా బిహేవ్ చేయకుండా పద్ధతిగా పోలీసులకు సహకరించాడు అని అది అల్లు అర్జున్  పద్ధతి అని ప్రశంసిస్తున్నారు . అంతేకాదు తన తప్పులేదు అని బన్నీకి తెలుసు అని ఆ కారణంగానే న్యాయం నమ్ముకొని న్యాయస్థానం ఏ విధంగా చెప్తే ఆ విధంగా ఫాలో అయ్యాడు అని సేఫ్ గా బయటపడ్డాడు అని చెప్పుకొస్తున్నారు . అంతేకాదు పుష్ప2 సినిమాలోని డైలాగ్ తగ్గేదేలే అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎప్పటికీ తగ్గదు అంటూ ఓ రేంజ్ లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ పొగిడేస్తున్నారు. కానీ అల్లు అర్జున్ లైఫ్ లో మాత్రం నిన్న రాత్రి మర్చిపోలేనిది. ఎప్పటికి గుర్తు ఉండిపోతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: