నాకు అల్లు అర్జున్ కి ఎటువంటి వైర్యం లేదు అని ..చట్టం తన పని తాను చేసుకోపోతుంది అని.. అల్లు అర్జున్ తప్పు చేశాడు కాబట్టే గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంది అని ..దీన్ని పెద్ద సీన్ క్రియేట్ చేయొద్దు అంటూ ఓపెన్ గానే చెప్పుకొచ్చారు . అయితే నిన్న సాయంత్రం చంచల్ గూడా జైలుకు వెళ్లిన బన్ని బెయిల్ మీద రిలీజ్ అవ్వాల్సి ఉంది . కానీ అర్ధరాత్రి హై డ్రామా మధ్య అల్లు అర్జున్ రాత్రంతా చంచల్ గూడా జైల్ లోనే ఉండిపోయాడు . మరీ ముఖ్యంగా 11 గంటల వరకు అల్లు అరవింద్ కూడా కొడుకు రిలీజ్ అవుతాడు అంటూ అక్కడే వెయిట్ చేశారు. ఇక వల్ల కాదు అంటూ ఆ తర్వాత క్యాబ్ బుక్ చేసుకుని మరి ఇంటికి వెళ్ళిపోయాడు .
అందుతున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్ చంచల్ గూడ జైల్లో అండర్ ట్రయల్ ఖైదీ నెంబర్ 7697 ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు అల్లు అర్జున్ రాత్రి జైల్లో మంజీరా బ్యారక్ లో ఉన్నారట .అంతేకాదు రాత్రంతా భోజనం కూడా చేయలేదట . నేల పైనే పడుకున్నారట. ఇది అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి కడుపు మండిపోయేలా చేస్తుంది . జైల్లో అల్లు అర్జున్ నరకం అనుభవించాడు అంటున్నారు అల్లు అర్జున్ అభిమానులు. ఈ పాపం ఊరికే పోదు అంటూ కూడా బన్నీ అభిమానులు ఓపెన్గా శాపనార్ధాలు పెడుతున్నారు. అయితే జైలు అధికారులు ఆయనకు భోజనాలు ఏర్పాటు చేశారు అని కానీ అల్లు అర్జున్ భోజనం చేయకుండా ఉండిపోయాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అల్లు అర్జున్ బాగా హర్ట్ అయినట్టు తెలుస్తుంది . సోషల్ మీడియాలో ఇప్పుడు అల్లు అర్జున్కి సంబంధించిన ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది..!