కథ విషయానికి వస్తే డైరెక్టర్ కావాలని కలతో వాసు (సిద్ధార్థ్) నిర్మాతలను కలుస్తూ కథలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారట.. ఆ సమయంలోనే ఒక యాక్సిడెంట్ వల్ల తన జీవితంలో జరిగిన రెండేళ్ల జ్ఞాపకాలని మర్చిపోతాడు వాసు. అయితే కోలుకున్న తర్వాత కలిసిన బాబి (కరుణాకరన్ ) తో బెంగళూరుకు వెళ్లడం జరుగుతుంది. అక్కడ కేఫ్ లో పనిచేస్తూ ఉండగా.. సుబ్బలక్ష్మి (ఆషికా రంగనాథ్) ను చూసి తొలిచూపులోనే ఆమెను ప్రేమిస్తాడు కానీ ఆమె మాత్రం అతడి ప్రేమను రిజెక్ట్ చేస్తుంది.. అయితే తమ తల్లిదండ్రులకు చెప్పి సుబ్బలక్ష్మిని ఒప్పించి పెళ్లి చేసుకోవాలని ఇంటికి వస్తారు.. అయితే ఆమె ఫోటో చేసిన కుటుంబ సభ్యులు, స్నేహితులు సైతం ఒక్కసారిగా షాక్ అవుతారు..లక్ష్మీతో పెళ్లి కుదిరిందని ఆమె కాకుండా మరొకరిని వివాహం చేసుకోమని తెలియజేస్తారు. అయినా పట్టువదలని వాసు సుబ్బలక్ష్మితో పెళ్లి ఎందుకు వద్దన్నారు? ఇంతకీ ఆమె ఎవరు ?గతంలో ఆమెకు వాసుకి ఏం జరిగిందనే విషయం తెలియాలి అంటే వెండితెర పైన చూడాల్సిందే..
మిస్ యు సినిమా తెలుగులో నాని నటించిన హాయ్ నాన్న సినిమా ని గుర్తుకు చేస్తున్నట్టుగా కనిపిస్తోందని నేటిజన్స్ తెలుపుతున్నారు.. ఈ సినిమా ఒక కేసుతో ముడిపడి ఉంటుందని మిగిలిన స్టోరీ అంతా కూడా మామూలే అన్నట్లుగా తెలుపుతున్నారు. అక్కడక్కడ కామెడీ సన్నివేశాలు తప్ప ఇందులో చెప్పుకోదగ్గ ఏమి లేదని తెలియజేస్తున్నారు. అలాగే ఇందులో భాగవద్వేగా సన్నివేశాలు సరిగ్గా పండించలేదని అనవసరంగా వచ్చే పాటలు సాగదీతతో ఉంటున్నాయట. సినిమా టైం 2:06 నిమిషాలైనా థియేటర్లు ఎంతసేపు కి పుట్టి కావడం లేదని భావన కలిగిస్తోందట.
ఇక నటి నటుల యాక్టింగ్ విషయానికి వస్తే.. సిద్ధార్థ్ అలవాటైన పాత్ర కాబట్టి అవలీలగా నటించారు. హీరోయిన్ ఆషికా రంగనాథ్ తెరపైన మంచి జోడీగా అనిపించిన ఇద్దరు మద్యం జరిగే కొన్ని భాగోద్వేగా సన్నివేశాలు పర్వాలేదు అనిపించుకుంటున్నాయట. ఈమె పాత్రలో సహజంగానే ఒదిగిపోయింది. సాంకేతికంగా టెక్నికల్ పరంగా ఈ సినిమా బాగానే ఉన్నా పాటలు, కొరియోగ్రఫీ ఏ మాత్రం మెప్పించలేదట.. డైరెక్టర్ రాజేష్ కథా కథనాలపరంగా పెద్దగా ఇంట్రెస్ట్ చూప లేదన్నట్లుగా కనిపిస్తోందట
ప్లస్ పాయింట్స్ వస్తే:
సిద్ధార్థ్, ఆశిక రంగనాథ్ , ఇందులో కొన్ని మలుపు తిప్పే సన్నివేశాలు.
మైనస్ పాయింట్స్:
ఊహకు తగ్గట్టుగా సాగే స్టోరీ, బలం లేని సన్నివేశాల మధ్య భాగోద్వేగమైన సన్నివేశాలు..
మొత్తానికి మిస్ యు సినిమా అక్కడక్కడ మాత్రమే మెప్పించింది.