టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన పుష్ప 2 సినిమా రిలీజ్ కు ముందు రోజు సంథ్య థియేట‌ర్ ద‌గ్గ‌ర జ‌రిగిన సంఘ‌ట‌న‌లో రేవ‌తి అనే మ‌హిళ మృతి చెందారు. ఈ కేసులో శుక్ర‌వారం పోలీసులు అర్జున్‌ను అరెస్టు చేయ‌డం.. రాత్రి కూడా అర్జున్‌కు బెయిల్ వ‌చ్చినా జైలులోనే ఉండ‌డం అంతా హై డ్రామాను త‌ల‌పించింది. ఇదిలా ఉంటే ఈ కేసుపై ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి త‌న‌దైన స్టైల్లో స్పందించారు. హోంశాఖ తన వద్దే ఉందని అల్లు అర్జున్ కేసు గురించి తనకు మొత్తం తెలుసని స్పష్టం చేశారు.


హిందీ చానల్ ఇంటర్యూ లో ఆయ‌న మాట్లాడుతూ బ‌న్నీ అరెస్టుపై స్పందించారు. రాజ్యాంగం ఉంది దానికి అనుగుణంగానే చట్టం పనిచేస్తుందని అర్జున్ కేసులో కూడా అంతే అని తెలిపారు. అక్క‌డ ఓ మ‌హిళ మృతి చెందింది ... ఆమె కొడుకు జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య తో పోరాటం చేస్తున్నాడు .. దానికి బాధ్య‌లు ఎవ‌రు ? జ‌నం ప్రాణాలు పోయినా కేసు పెట్ట‌వ‌ద్దా ? అని ప్ర‌శ్నించారు. కారు వ‌చ్చి సినిమా చూసి వెళితే ఇబ్బంది లేద‌ని.. కారు లో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి చేతులు ఊపి హ‌డావిడి చేశారని.. దీంతో జ‌నం పెద్ద ఎత్తున ఎగ‌బ‌డ‌డంతో కంట్రోల్ కాలేద‌న్నారు.


అల్లు అర్జున్ ను ఈ కేసులో A11 గా పోలీసులు పెట్టారని.. వాళ్లు స్పెష‌ల్ గా దేశం కోసం చేసింది ఏం లేదని సినిమాలు తీసి.. డ‌బ్బులు సంపాదించుకున్నారు ... సరిహద్దుల్లో యుద్ధాలు చేసి విజయాలు తెచ్చారా అని ? ప్రశ్నించారు. అలాగే రేవంత్ రెడ్డి తన హయాంలో చట్టం ఎంత నిష్పక్షిపాతంగా పని చేస్తుందో చెప్పడానికి ఈ కేసునే ఉదాహరణగా అని తెలిపారు. అల్లు అర్జున్ మామ‌.. పిల్ల‌ను ఇచ్చిన చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ నేత .. నాకు బంధువు అని కూడా రేవంత్ తెలిపారు. అలాగే చ‌నిపోయిన మ‌హిళ కొడుకు కోమాలో ఉన్నాడు ?  దానికి బాధ్యుల‌ను వ‌దిలి పెట్టాలా ? అని ప్ర‌శ్నించారు. ఇక త‌న‌కు ఫేవ‌రెట్ హీరోలు అంటూ ఎవ‌రూ లేర‌ని.. ఇప్పుడు తానే స్టార్‌ను త‌న‌కే ఫ్యాన్స్ ఉండాల‌ని స‌ర‌దాగా అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: