ఇప్పుడు ఎక్కడ చూసినా సరే స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ న్యూస్ ఎక్కువగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారుతుంది. పుష్ప 2 సినిమా అల్లు అర్జున్ పేరు ఎలా హాట్ టాపిక్ గా మారేలా చేసిందో .. అదే పుష్ప 2 సినిమా అల్లు అర్జున్ ఎప్పుడు మర్చిపోలేని విధంగా భారీ దెబ్బ కూడా కొట్టింది . పుష్ప 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5వ తేదీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే.  కాగా సంధ్యా థియేటర్స్ లో పుష్ప2 సినిమా రిలీజ్ అవ్వగా చూసేందుకు అల్లు అర్జున్ తన కుటుంబంతో వచ్చాడు .
 

అయితే అల్లు అర్జున్ ని చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. ఈ క్రమంలోనే అక్కడ తొక్కిసలాట జరిగింది . ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది .ఆమె కొడుకు ఇప్పుడు కోమాలో ఉన్నారు . డాక్టర్ అబ్బాయి పరిస్థితి ఇప్పుడిప్పుడే చెప్పలేమంటూ చెప్పుకొస్తున్నారు .అయితే ఇదే మూమెంట్లో అల్లు అర్జున్ ని సంధ్య  థియేటర్స్లో  తొక్కిసలాట జరిగిన కారణంగా రేవతి అనే మహిళ మృతి చెందిన కారణంగా అరెస్ట్ చేశారు తెలంగాణ పోలీసులు. అల్లు అర్జున్ అరెస్టు విషయం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ  వైరల్ గా మారింది. అయితే చాలా నార్మల్గానే అరెస్ట్ చేశారు అని మళ్లీ వెంటనే ఇంటికి వచ్చేస్తాడు బన్నీ అని అంతా అనుకున్నారు .



కానీ మార్గ మధ్యలోనే హైడ్రామా నడిచి అల్లు అర్జున్ జైలుకు పంపించే విధంగా కూడా భారీ ప్లాన్స్ వేసారు . అసలు ఎక్కడ కూడా టైం ఇవ్వకుండా అల్లు అర్జున్ ను గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లడం అక్కడ పరీక్షలు చేయించడం ..ఆ తర్వాత నాంపల్లి కోర్టుకు తరలించడం .. అక్కడ బన్నీ చెప్పిన వాదన విని ..తప్పు బన్నీదే అంటూ తీర్పు రావడం ..బన్నీని రిమాండ్ కు తరలించాలి అంటూ ఆదేశించడం ..చకచక జరిగిపోయాయి . దీంతో బన్నీ ఫాన్స్ షాక్ అయిపోయారు. రాత్రంతా కూడా బన్నీ జైల్లు లోనే ఉండిపోయాడు . అయితే బన్నీకి భయం అంటే ఏంటో చూపించడానికే ఇలా చేశారు అంటూ సామాన్య జనాలు మాట్లాడుకుంటున్నారు. పుష్ప 2 ప్రమోషన్స్ లో బన్నీ మాట్లాడిన పద్ధతి కొంత మందికి నచ్చలేదు అని.. అందుకే ఇలా చేశారు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: