ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో భాగంగా పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నిన్ననే కోర్టులో హాజరు పరిచి 14 రోజులపాటు రిమాండ్ విధించేలా కూడా చేశారు. అయితే హైకోర్టు మధ్యంతర బెయిల్ అందిస్తూ బన్నీకి చాలా రిలీఫ్ కలిగించింది. దాంతో అతని 14 రోజుల కస్టడీ క్యాన్సిల్ అయింది. అలాగే జైల్లో ఉండాల్సిన అవసరం లేకుండా పోయింది. బెయిల్ ఆర్డర్స్ రావడం ఆలస్యమైంది కాబట్టి నిన్న నైట్ మొత్తం బన్నీ చంచల్గూడా జైల్లోనే ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు ఆయన తన ఫ్యామిలీతో రీ యూనిట్ అయ్యారు. దాంతో అందరూ సంతోషిస్తున్నారు.

అల్లు అర్జున్ అరెస్టు తర్వాత చాలామంది తెలంగాణ సర్కార్ పై విరుచుకుపడ్డారు. అతని ప్రమేయం లేకపోయినా ఇలా కేసులో ఇరికించి, అతన్ని అరెస్టు చేయడం ఎంతవరకు న్యాయమంటూ ప్రశ్నించారు. కేటీఆర్ నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలోని అందరూ, అలాగే సామాన్యులు, మేధావులు అల్లు అర్జున్ అరెస్టును ఖండించారు. ఈ నేపథ్యంలో చట్టం ముందు అందరూ సమానులే అని రేవంత్ రెడ్డి మాట్లాడారు. హీరోలకు అభిమానులు ఉండకూడదు అన్నారు. ఉంటే గింటే ఫ్యాన్స్ తనకే ఉండాలి అని అన్నారు. ఆ మాటలు మాట్లాడిన తర్వాత రేవంత్ రెడ్డి పై చాలామంది విమర్శలు చేశారు.

బన్నీ మామూలు వ్యక్తి అని, సరిహద్దులకు వెళ్లి ఆయనేమీ యుద్ధం చేయలేదని రేవంత్ రెడ్డి అనడాన్ని చాలామంది ట్రోల్ చేస్తున్నారు. బన్నీ మామూలు వ్యక్తి అయితే అతనితోపాటు అందరికీ పోలీసులు, ప్రభుత్వం బాధ్యత కల్పించాలి, కానీ మీరు ఫెయిల్ అయ్యారు, రేవతి మరణానికి మీరే కారణం అని అంటున్నారు. అయితే ఇప్పుడు బన్నీకి మేధావులు అందరూ సపోర్ట్ చేస్తున్నారు కానీ పల్లవి ప్రశాంత్‌ విషయంలో ఒక్కరు కూడా మద్దతు ఇవ్వలేదు. నిజానికి అతన్ని అరెస్టు చేసినప్పుడు అందరూ ప్రశాంత్ కు ఇలాగే జరగాలి అని అన్నారు. అప్పుడు పల్లవి ప్రశాంత్‌ బిగ్ బాస్ విన్ అయి ర్యాలీ చేపట్టాడు, ఆ ర్యాలీ కారణంగా ఫాన్స్ బయటకు రావడం, పబ్లిక్ ప్రాపర్టీకి డ్యామేజ్ కలిగించడం చేశారు.

కానీ బన్నీ ఘటనలో ఒక నిండు ప్రాణం పోయింది. ఆస్తులకు నష్టం వాటిల్లితే తిరిగి సంపాదించుకోగలరు కానీ ప్రాణాన్ని తీసుకురాగలరా? చిన్న పిల్లలకు తల్లిని వెనక్కి తీసుకు రాగలరా? బన్నీ మాత్రమే ఈ ఘటనకు కారణం కాకపోవచ్చు కానీ ఆయన బాధ్యత ఇందులో లేదా? అతన్ని అరెస్ట్ చేయడాన్ని ఖండించడం, పల్లవి ప్రశాంత్ విషయంలో అలా చేయకపోవడానికి కారణం ఏంటి? బన్నీ కులం, డబ్బు, ఇంకా ఇమేజ్ ఎక్కువ అనే కదా అని చాలామంది సూటిగా ప్రశ్నలు వేస్తున్నారు. ఇక్కడ క్లియర్ గా మేధావుల మైండ్ సెట్ ఏంటో అర్థం అయిపోతుందని కామెంట్లు చేస్తున్నారు. బలహీనుడిని ఎప్పుడూ తొక్కేస్తూనే ఉంటారని, బలవంతుడికి ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారని వ్యాఖ్యానిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: