అలాగే మన భారతదేశంలో క్రికెట్ మ్యాచ్లు జరిగినప్పుడు కూడా పోలీసులు క్రికెట్ చూస్తూ ఉంటారని ఆయన వాదించారు .. ఇక ఇప్పుడు దీంతో నిరంజన్ రెడ్డి పేరు సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారింది .. నిరంజన్ రెడ్డి ప్రొఫైల్ గురించి తెలుసుకునేందుకు నేటిజెన్లు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి లాయర్ నిరంజన్ రెడ్డి ఎంతో సన్నిహితులు .. అలాగే చిరంజీవికి మెగా కుటుంబానికి లీగల్ అడ్వైజర్ గా కూడా చాలాకాలంగా ఆయన పని చేశారు .. ఆ అనుబంధంతోనే మెగా ఫ్యామిలీతో కలిసి టాలీవుడ్ లో నిర్మాతగా కూడా నిరంజన్ రెడ్డి 2011లో గగనం సినిమాతో నిర్మాతగా మారారు .. ఆ తర్వాత క్షణం , ఘాజీ , వైల్డ్ డాగ్ , ఆచార్య వంటి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు .. ఈ క్రమంలో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన వార్త వెన్న నిరంజన్ రెడ్డి వెంటనే హైకోర్టులో క్యాష్ పిటిషన్ వేయించారు..
ఇదే క్రమంలో తన వాదనా పటిమతో అల్లు అర్జున్ కు బెయిల్ వచ్చేలా వ్యవహరించారు నిరంజన్ రెడ్డి. అలాగే ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు సంబంచిన పలు కీలక కేసులను దశాబ్దం క్రితం వాదించిన అనుభవం నిరంజన్ రెడ్డిలో ఉంది .. ఈ క్రమంలోనే రాజ్యసభకు వైసిపి తరఫున 2022లో నిరంజన్ రెడ్డిని నామినేట్ చేశారు .. అలాగే వైసిపి మాజీ ఎమ్మెల్యే అల్లు అర్జున్ ఫ్రెండ్ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి , చిరంజీవి కలిసి ఈ కేసులో వాదనలు వినిపించేందుకు నిరంజన్ రెడ్డిని రంగంలోకి దించారట .. అలాగే వైసిపి నేతలకు చెందిన పలు కీలక కేసులను కూడా నిరంజన్ రెడ్డి శిల్పా రవిచంద్ర రెడ్డికి అప్పగించారని కూడా అంటున్నారు .. అటు మెగా ఫ్యామిలీకి ఇటు జగన్ కి నిరంజన్ రెడ్డికి కీలక సంబంధాలు ఉన్నాయని తెలుస్తుంది.